ETV Bharat / jagte-raho

కన్న కొడుకుని బలికొన్న తల్లి వివాహేతర సంబంధం

author img

By

Published : Oct 7, 2020, 9:43 PM IST

boy died
కన్న కొడుకుని బలికొన్న తల్లి వివాహేతర సంబంధం..

తల్లి వివాహేతర సంబంధం.. ఓ బాలుడిని ప్రాణాలు తీసింది. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణం జరిగింది. బాలుడు మృతదేహాన్ని ఖననం చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్​ చేశారు.

తల్లి వివాహేతర సంబంధానికి పసిబాలుడు బలైన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. అభం శుభం తెలియని పసి మొగ్గని బాల్యంలోనే తుంచేశారు.. ఆ కసాయిలు. చిలుకూరు మండల పరిధిలోని మిట్స్​ కళాశాల పరిధిలోని గుట్టల్లో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

వరంగల్​ జిల్లా గూడూరుకు చెందిన శ్రీనివాస్​, ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం.. గుగులోతుకు చెందిన ఉషారాణికి ఏడాది కిందట పరిచయమైంది. పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం ఏపీలోని కృష్ణాజిల్లా చిలకల్లు మండలం అనుమంచిపల్లిలో ఓ గది అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు.

సంపంగి శ్రీనివాస్​కు రెండు సార్లు వివాహం జరిగింది. మొదటి భార్యను హత్య చేయగా.. రెండో భార్య విడాకులు తీసుకొంది. గుగులోతు ఉషారాణి కూడా భర్తను వదిలేసి తన ఇద్దరు పిల్లలు సుకుమార్, అంకిత్​లతో చిల్లకల్లు మండలం ఆనుమంచిపల్లిలో శ్రీనివాస్​తో కలిసి సహజీవనం చేస్తోంది.

ఈనెల నాలుగో తేదీ రాత్రి.. శ్రీనివాస్​, ఉషారాణికి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంచిన శ్రీనివాస్​.. పక్కనే ఉన్న ఇద్దరు పిల్లల్ని చితకబాదాడు. ఈ ఘటనలో చిన్న కుమారుడు అంకిత్ కోమాలోకి వెళ్లిపోయాడు. సొంత వాహనంలో కోదాడ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మృతిచెందాడు. అనంతరం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని మిట్స్​ కళాశాల గుట్టలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ రాత్రే ఆనుమంచిపల్లోని ఇంటికి వెళ్లిపోయారు.

బాబు ఎక్కడంటూ చుట్టుపక్కల వారి ప్రశ్నలకు.. ఇల్లు వదిలి వెళ్లిపోయాడని సమాధానం ఇచ్చారు నిందితులు. అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విచారణలో అసలు విషయం బయటపడింది.

బాలుడి మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు.. బయటకు తీశారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఖననం చేశారు. శ్రీనివాస్​, ఉషారాణిలను చిల్లకల్లు పోలీసులు అరెస్ట్​ చేశారు.

కన్న కొడుకుని బలికొన్న తల్లి వివాహేతర సంబంధం..

ఇవీచూడండి: బైక్​లు ఢీకొన్న ఘటనలో మామ, మేనల్లుడు మృతి... ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.