ETV Bharat / jagte-raho

'యువత మత్తుకు బానిస కావొద్దు.. జీవితం పాడు చేసుకోవద్దు'

author img

By

Published : Dec 5, 2020, 1:15 PM IST

యువత మాదకద్రవ్యాలకు బానిస కావొద్దని, డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ ఖమ్మం జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారులు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆబ్కారీ సూపరింటెండెంట్​ సోమిరెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ యాత్రలో జిల్లాలోని ఎక్సైజ్ ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

khammam district excise department
ఖమ్మం జిల్లాలో ఆబ్కారీ సైకిల్ యాత్ర

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఆబ్కారీ శాఖ అధికారులు సైకిల్ యాత్ర చేపట్టారు. మాదకద్రవ్యాలకు యువత బానిసకావొద్దని అవగాహన కల్పిస్తూ చేపట్టిన ఈ యాత్రకు ఆబ్కారీ సూపరింటెండెంట్ సోమిరెడ్డి నాయకత్వం వహించారు.

సైకిల్​పై యాత్ర చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ సాగిన ఈ యాత్రలో జిల్లాలోని ఆబ్కారీ ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఇటీవల జిల్లాలో గంజాయి కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, యువత మత్తుకు బానిసగా మారుతున్నారని సోమిరెడ్డి తెలిపారు. ఆబ్కారీ శాఖ బాధ్యతగా యువతకు అవగాహన కల్పించడానికే ఈ యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.