ETV Bharat / jagte-raho

వేట కొడవళ్లతో వెంటాడి.. నడి రోడ్డుపై నరికేసి..

author img

By

Published : Jun 11, 2020, 6:01 PM IST

Updated : Jun 11, 2020, 11:47 PM IST

attack with knifes in kondamallepalli
దారుణం: నడి రోడ్డుపై వేట కొడవళ్లతో దాడి

రాళ్లు కొట్టి అమ్ముకునే ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన విభేదాలు... అగ్నికి ఆజ్యం పోశాయి. ఆరు నెలల క్రితం ఒకరు దాడి చేస్తే... ప్రతీకారంగా మరో వర్గం ఇవాళ ప్రతిదాడికి దిగింది. నిత్యం రద్దీ కనిపించే ప్రాంతంలో, నడిరోడ్డుపై కత్తితో దాడికి దిగిన దృశ్యాలు... నల్గొండ జిల్లాలో బీభత్స వాతావరణాన్ని తలపించాయి.

దారుణం: నడి రోడ్డుపై వేట కొడవళ్లతో దాడి

రోజూ రద్దీగా కనిపించే ప్రాంతంలో అందరూ చూస్తుండగానే... పట్టపగలు కత్తులతో దాడికి దిగారు. మెడపై అమానుష రీతిలో పదేపదే నరికిన తీరు జుగుప్సాకరంగా మారగా... బాధితుని పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై... నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొల్ ముంతల్ పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ తండాకు చెందిన రాపాని యాదగిరిపై... అదే గ్రామానికి చెందిన సంపంగి రాములుతోపాటు ఆయన తండ్రి కత్తులతో దాడి చేశారు.

యాదగిరి, రాములు ఇద్దరూ... రాళ్లు కొట్టి విక్రయిస్తుంటారు. తరచూ తగాదా పడే వీరు... క్రమంగా బద్ధ శత్రువులయ్యారు. ఊళ్లో జరిగిన చిన్న వివాదంతో ఆరు నెలల క్రితం రాములుపై... యాదగిరి, ఆయన వర్గీయులు దాడికి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ ఘటనలో యాదగిరితోపాటు ఇంకో 11 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కొద్దిరోజులు జైలులో ఉండి... బెయిల్ పై తిరిగొచ్చారు.

పాత కక్షలతో రాములు... అదను కోసం వేచి చూశాడు. శత్రువు కొండమల్లెపల్లికి వెళ్తున్నాడని తెలుసుకుని... తండ్రితో కలిసి పథకం పన్నాడు. మార్కెట్ సమీపంలోని పెట్రోలు బంకు వద్ద తండ్రి, కొడుకులిద్దరూ... ప్రత్యర్థిపై ఒక్క ఉదుటన దాడికి దిగారు. ఈ ఇద్దరికి ఇంకో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. చుట్టూ ఉన్న జనం తేరుకునేలోపే... బాధితుడు మడుగులో కొట్టుకుంటున్నాడు. మృతిచెందాడని భావించిన నిందితులు... అక్కడి నుంచి పరారయ్యారు. క్షతగాత్రుణ్ని పోలీసులు దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ పంపించారు. నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి: దారుణం: మొదటి రాత్రే భార్యను చంపేసిన భర్త!

Last Updated :Jun 11, 2020, 11:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.