ETV Bharat / international

రూ.162తో టికెట్ కొంటే రూ.10వేల కోట్ల లాటరీ.. మెగా మిలియన్స్ జాక్​పాట్ రూల్స్ మీకు తెలుసా?

author img

By

Published : Jan 15, 2023, 5:02 PM IST

అమెరికాలో జరిగిన మెగా మిలియన్స్​ జాక్​పాట్​లో ఓ వ్యక్తి ఏకంగా రూ. 10,973 కోట్లు గెలుచుకున్నాడు. అసలు ఈ లాటరీ ఏంటి? దీనిని ఎలా నిర్వహిస్తారు? అన్న విషయాలను తెలుసుకుందాం.

mega millions jackpot rules
mega millions jackpot rules

సాధారణంగానే లాటరీలు అంటే ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అలాంటిది లాటరీ విలువ రూ. 10 వేల కోట్లకు పైగా ఉంటే ప్రజల్లో పోటీ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో గత నలభై ఏళ్లుగా లాటరీ విక్రయాలు జరుపుతున్న మెగా మిలియన్స్ జాక్​పాట్​ 2023లో తొలి లాటరీని నిర్వహించింది. ఈ పోటీల్లో ఓ వ్యక్తి రూ. 10,973 కోట్లను గెలుచుకున్నాడు. మరీ ఈ లాటరీ ఎలా ఉంటుంది? విజేతను ఎలా ఎంపిక చేస్తారు? అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి.

మెగా మిలియన్స్​ జాక్​పాట్ రూల్స్​

  • మెగా మిలియన్స్​ జాక్​పాట్​లో పాల్గొనాలంటే మొదటగా వెబ్​సైట్​ నుంచి టికెట్​ కొనుక్కోవాలి. దీని ధరను రూ.162గా నిర్ణయించారు.
  • ఆ తర్వాత రెండు వేర్వేరు విభాగాల నుంచి ఆరు అంకెలను ఎంపిక చేసుకోవాలి
  • మొదటి విభాగంలో ఐదు వేర్వేరు అంకెలను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 1 నుంచి 70 వరకు అంకెలు ఉంటాయి.
  • రెండో విభాగంలో ఒక అంకెను ఎంపిక చేసుకోవాలి. ఇందులో 1 నుంచి 25 అంకెలు ఉంటాయి. దీనినే మెగాబాల్​ అంటారు.
  • ఈ ఆరు అంకెలు ఒకేసారి కలిసిన వారిని ఈ మెగా మిలియన్స్​​ జాక్​పాట్​ వరిస్తుంది.
  • 30,25,75,350 మంది పోటీదారుల్లో పాల్గొంటే ఒకే వ్యక్తిని ఈ జాక్​పాట్​ వరిస్తుంది.
  • మెగా మిలియన్స్​ జాక్​పాట్​తో పాటు ప్రతి 1,26,07,306 మందిలో ఒకరికి రూ. 8.12 కోట్లు బహుమతిగా అందిస్తారు.
  • వీరితో పాటు ప్రతి 9,31,001 మందిలో ఒకరికి రూ. 8.12 లక్షలు ఇస్తారు.

రూ. 10 వేల కోట్లు గెలుచుకున్న ఓ వ్యక్తి
శుక్రవారం జరిగిన మెగా మిలియన్స్​ జాక్​పాట్​లో మైనే స్టేట్​లోని లెబనాన్​కు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. మెగా మిలియన్స్​​ జాక్​పాట్​లో అతడు రూ.10,973 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో నెలలో ఎప్పుడైనా 13వ తేదీ శుక్రవారాన్ని అన్​లక్కీడేగా భావిస్తారు. కానీ అదే రోజు.. అతడికి భారీ జాక్​పాట్​ తగిలింది. జనవరి 13న మెగా మిలియన్స్​​ జాక్​పాట్​ తీసిన డ్రాలో విన్నింగ్​ టికెట్​ సంఖ్యతో అతడి టిక్కెట్​లోని 30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో అతడిని విజేతగా ప్రకటించింది మెగామిలియన్స్​ జాక్​పాట్.

ఎలా చెలిస్తారు? పన్నులు ఎంత?
విజేతకు మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు.. 29 వాయిదాల్లో చెల్లిస్తారు. అలా కాకుండా.. మొత్తం ఒకేసారి కావాలంటే లాటరీ మొత్తాన్ని తగ్గించి సుమారు రూ.7వేల కోట్లు ఇస్తారు. అందులో అతడు ఫెడరల్​​ ట్యాక్స్​ కింద కేంద్ర ప్రభుత్వానికి 24 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాత అతడికి వచ్చిన సొమ్ము సుమారు రూ.5వేల కోట్లుగా మారనుంది. అతడు ఏ రాష్ట్రంలో లాటరీ టికెట్​ కొనుగోలు చేశాడో.. అక్కడి నిబంధనల ప్రకారం స్టేట్ ట్యాక్స్​ కట్టాలి. రాష్ట్రాన్ని బట్టి అది 0-10 శాతం ఉండొచ్చు. ఈ లెక్కన అతడికి సుమారు రూ. 3వేల కోట్లు అందుతాయి.

మెగా మిలియన్స్​ జాక్​పాట్​ను గెలుచుకున్న వ్యక్తికి ఆ లాటరీ సంస్థ​ ప్రధాన డెరెక్టర్​ పాట్​ మెక్​డొనాల్ట్​ అభినందనలు తెలిపారు. మెగా మిలియన్స్​ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద జాక్​పాట్​ అని ఆయన తెలిపారు. 2018లో దక్షిణ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి రూ.12,436​ కోట్లు గెలుచుకున్నాడు. కాగా, మెగా మిలియన్స్​ జాక్​పాట్ సుమారు 40 ఏళ్లుగా లాటరీ విక్రయాలు జరుపుతోంది.

Kerala lottery: కేరళలోనూ లాటరీలు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. టికెట్ కొన్నవారికి కళ్లుచెదిరే ప్రైజ్ మనీని కట్టబెడుతున్నాయి. వందలు పెడితే రూ.కోట్లు వచ్చిపడుతున్నాయి కాబట్టి సాధారణంగానే దీనిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇటీవల ఈ ఆసక్తి ఇంకా ఎక్కువైంది. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. కేరళ ప్రభుత్వం విక్రయిస్తున్న ఈ లాటరీల గురించి అందరూ ఆరా తీస్తున్నారు. టికెట్లు ఎలా కొనలానే విషయంపై గూగుల్​లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాటరీకి సంబంధించిన వివరాలు ప్రశ్నలు-సమాధానాల రూపంలో మీకోసం..

ఇవీ చదవండి: మెగా మిలియన్ డ్రాలో జాక్​పాట్​.. రూ.10వేల కోట్లు గెలుచుకున్న వ్యక్తి

లాటరీలో రూ.10 వేల కోట్లు జాక్​పాట్.. పన్ను కట్టిన తర్వాత మిగిలేది అంతేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.