ETV Bharat / international

మెగా మిలియన్ డ్రాలో జాక్​పాట్​.. రూ.10వేల కోట్లు గెలుచుకున్న వ్యక్తి

author img

By

Published : Jan 15, 2023, 12:09 PM IST

ఓ వ్యక్తి భారీ జాక్​పాట్​ కొట్టేశాడు. మెగా మిలియన్స్​ జాక్​పాట్​లో రూ.10,973 కోట్లకుపైగా గెలుచుకున్నాడు. జనవరి 13న తీసిన డ్రాలో అతడు కొనుగోలు చేసిన టికెట్లలోని అన్ని నంబర్లు సరిపోలాయి.

lottery
lottery

లాటరీ తగలడమే పెద్ద అదృష్టంగా భావిస్తారు అందరూ.. అదే లాటరీ భారీ స్థాయిలో కోట్ల రూపాయలు కుమ్మరిస్తే.. కనీవినీ ఎరుగని రీతిలో కాసుల వర్షం కురిపిస్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అప్పటి వరకూ గడిపే సాదాసీదా జీవితం ఒక్కసారిగా మారిపోతుంది! కన్న కలలన్నీ నిజం చేసుకునే పరిస్థితులు మన చేతుల్లోనే ఉంటాయి! ఓ అమెరికన్​కు అచ్చం ఇలాంటి అదృష్టమే వరించింది.

వివరాల్లోకి వెళ్తే.. మైనే స్టేట్​లోని లెబనాన్​కు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. మెగా మిలియన్​ జాక్​పాట్​లో అతడు రూ.10,973 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో నెలలో ఎప్పుడైనా 13వ తేదీ శుక్రవారాన్ని అన్​లక్కీడేగా భావిస్తారు. కానీ అదే రోజు.. అతడికి భారీ జాక్​పాట్​ తగిలింది. జనవరి 13న మెగా మిలియన్​ జాక్​పాట్​ తీసిన డ్రాలో విన్నింగ్​ టికెట్​ సంఖ్యతో అతడి టిక్కెట్​లోని 30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో అతడిని విజేతగా ప్రకటించింది మెగామిలియన్స్​ జాక్​పాట్.
అయితే అతడు గెలుచుకున్న మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు.. 29 ఏళ్లపాటు వాయిదాల పద్దతిలో చెల్లిస్తారు. మొత్తం ఒకేసారి కావాలంటే రూ.7వేల కోట్లు మాత్రమే ఇస్తారు. కానీ చాలా మంది వాయిదాల పద్దతిలో కాకుండా ఒకేసారి తీసుకుంటారు.

మెగా మిలియన్స్​ జాక్​పాట్​ను గెలుచుకున్న వ్యక్తికి ఆ లాటరీ సంస్థ​ ప్రధాన డెరెక్టర్​ పాట్​ మెక్​డొనాల్ట్​ అభినందనలు తెలిపారు. మెగా మిలియన్స్​ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద జాక్​పాట్​ అని ఆయన తెలిపారు. 2018లో దక్షిణ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి రూ.12,436​ కోట్లు గెలుచుకున్నాడు. కాగా, మెగా మిలియన్స్​ జాక్​పాట్ సుమారు 40 ఏళ్లుగా లాటరీ విక్రయాలు జరుపుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.