ETV Bharat / international

China Birth Rate 2023 : ప్రపంచంలోనే వృద్ధ దేశంగా చైనా!.. భారీగా తగ్గిన జననాలు.. డ్రాగన్‌ కలవరం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 10:40 PM IST

China Birth Rate 2023 : చైనా తాను తీసుకున్న గోతిలో తానే పడింది. ఒకే బిడ్డ విధానంతో ప్రస్తుతం ఆ దేశ జనాభా రికార్డు స్థాయిలో క్షీణించింది. దాంతో చైనా ప్రపంచంలోనే ధనిక దేశం కాక ముందే, వృద్ధ దేశంగా మారుతోందని డ్రాగన్‌లో కలవరం మొదలైంది.

China Birth Rate 2023
China Birth Rate 2023

China Birth Rate 2023 : చైనాలో జననాల రేటు తగ్గుముఖం పడుతోంది. గతేడాది జననాలు మరో 10 శాతం క్షీణించాయి. 2022లో చైనాలో కేవలం 95.6 లక్షల మంది చిన్నారులు జన్మించినట్లు నేషనల్ హెల్త్ కమిషన్‌ ప్రచురించిన తాజా నివేదిక తెలిపింది. దాంతో ఆ దేశంలో 1949 నుంచి నమోదవుతున్న రికార్డుల్లో అత్యల్ప జననాలు సంభవించిన ఏడాదిగా రికార్డు నమోదైంది.

ఒకరిని కంటే చాలంటున్న కొత్త జంటలు!
China Birth Rate Problem : కొత్తగా పెళ్లయిన మెజారిటీ జంటలు కేవలం ఒకరిని కంటే చాలనే నిర్ణయానికి వచ్చాయి. కొందరు అసలు పిల్లలే వద్దని అనుకుంటున్నారు. ఫలితంగా గతేడాది చైనా జనాభా 1.41 బిలియన్ల వద్దే ఆగిపోయింది. వృద్ధ జనాభా పెరగడం వల్ల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడం వల్ల ఆదాయం తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదముందని చైనా ఆధికారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

'ఒకే బిడ్డ విధానం'తో మొదలైందీ సమస్య!
Child Policy In China : చైనాలో జనాభా సమస్యకు అసలు కారణం 'ఒకే బిడ్డ విధానం'తో మొదలైంది. 1980 నుంచి 2015 దాకా ఆ దేశంలో పెళ్లయిన జంటలు ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేసింది. జనాభా అసమతుల్యత ప్రభావం గురించి తెలియగానే ఆ విధానానికి స్వస్తి పలికింది. జనాభా రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కొత్తగా పిల్లలను కనేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించింది. అయినా ప్రస్తుతానికైతే పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.

ప్రోత్సహకాలే కాదు.. కొత్త పథకాలు కూడా..
Average Birth Rate In China : ప్రోత్సహకాలే కాదు.. జననాల రేటు పెంచేందుకు చైనాలో కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. పిల్లలు కనేవారికి సబ్సిడీలు, పెళ్లిళ్లకు అదనపు సెలవులు ఇస్తున్నారు. వీటితోపాటు పెళ్లి చేసుకోని జంటలు తమ సంతానాన్ని రిజిస్టర్‌ చేసుకొనే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలు పురుషులకు అనుకూలంగా ఉన్నాయని.. స్త్రీలకు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు జిన్‌పింగ్‌ సర్కారు యత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.