ETV Bharat / international

కత్తిదాడిలో ఎంపీ మృతి- అందరూ చూస్తుండగానే..

author img

By

Published : Oct 15, 2021, 6:54 PM IST

Updated : Oct 15, 2021, 8:32 PM IST

uk lawmaker stabbed
uk lawmaker stabbed

18:41 October 15

కత్తిదాడిలో ఎంపీ మృతి- అందరూ చూస్తుండగానే..

david amess
డేవిడ్​ అమెస్​

బ్రిటన్​ కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన చట్టసభ్యుడు డేవిడ్​ అమెస్​.. శుక్రవారం జరిగిన కత్తిదాడిలో మరణించారు. తూర్పు ఇంగ్లాండ్​లోని ఓ చర్చ్​లో సొంత నియోజకవర్గం ప్రజలతో అమెస్​ సమావేశం కాగా.. ఆయనపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ 25ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి ఎయిర్​ అంబులెన్స్​ను పంపించారు. డెవిడ్​కు చికిత్స అందించినా.. శరీరంపై అనేక కత్తిపోట్లు ఉండటం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే అమెస్​పై దాడి జరిగి రెండు గంటలు దాటినా ఆయనకు ఎవరూ చికిత్స అందివ్వలేదని స్థానిక కౌన్స్​లర్​ ఒకరు వ్యాఖ్యానించారు.

69ఏళ్ల అమెస్​.. 1983 నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. పార్లమెంట్​ సభ్యుల్లో ఆయనపై అందరికి గౌరవం ఉంది.  

అమెస్​ మృతిపై బ్రిటన్​ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

2016 జూన్​లో లేబర్​ పార్టీకి చెందిన జో కాక్స్.. ఉత్తర ఇంగ్లాండ్​లోని సొంత నియోజకవర్గంలో జరిగిన కత్తిదాడి​ ఘటనలో మరణించారు.  

బ్రిటన్​ చట్టసభ్యులకు పార్లమెంట్​లో పూర్తిస్థాయి రక్షణ ఉంటుంది. కానీ నియోజకవర్గాల్లో మాత్రం వారికి ఎటువంటి భద్రత ఉండదు.

Last Updated : Oct 15, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.