ETV Bharat / international

కరోనా పంజా: మెక్సికోలో 70వేలు దాటిన మృతులు

author img

By

Published : Sep 13, 2020, 6:28 PM IST

Updated : Sep 13, 2020, 6:54 PM IST

Coronavirus death toll reached to 70 thousands in Mexico
కరోనా పంజా: మెక్సికోలో 70వేలు దాటిన మృతులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 90 లక్షలకు చేరువైంది. 9 లక్షల 25వేల మందికిపైగా వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 2 కోట్ల 8లక్షల మంది బాధితులు కొవిడ్​ నుంచి కోలుకోవడం ఊరటనిచ్చే విషయం. మెక్సికోలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా.. 70వేల మందిని బలిగొంది.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 2కోట్ల 90 లక్షల మందికి కరోనా సోకింది. 9 లక్షల 25వేల మందికిపైగా మహమ్మారితో మృతిచెందారు. 20.8 లక్షల మందికిపైగా వైరస్​ను జయించగా.. 72 లక్షలకుపైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మెక్సికోలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూ.. తాజాగా 70వేల మార్కును దాటింది.

  • కరోనా కేసులలో మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 66.78 లక్షల మందికి వైరస్​ సోకింది. మొత్తం 1.98లక్షల మంది వైరస్​ కారణంగా మృత్యువాతపడ్డారు.
  • బ్రెజిల్​లో మొత్తం 43.15 లక్షల మందికి కరోనా పాజిటివ్​గా తేలగా.. లక్షా 31 వేల మరణాలు నమోదయ్యాయి.
  • మెక్సికోలో మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 6.63లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 70వేల మందికిపైగా చనిపోయారు.
  • పాక్​లో తాజాగా 526 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 3,01,481కు చేరింది. మరో 6 మంది వైరస్​తో చనిపోవడం వల్ల మృతుల సంఖ్య 6,379కు పెరిగింది.
  • దక్షిణ కొరియాలో కొత్తగా 121 మందికి కొవిడ్​ నిర్ధరణ కాగా.. కేసుల సంఖ్య 22,176కు చేరింది. వైరస్​తో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 358కు పెరిగింది.
  • సింగపూర్​లో మరో 49 కరోనా కేసులు బయటపడగా.. బాధితుల సంఖ్య 57,406కు పెరిగింది.
  • నేపాల్​లో కొత్తగా 1,039 మందికి పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55వేలకు చేరువైంది. కొవిడ్​ కారణంగా ఇప్పటివరకు అక్కడ 345 మంది మరణించారు.

ఇదీ చదవండి: రష్యాలో అన్ని ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్!

Last Updated :Sep 13, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.