ETV Bharat / international

'కశ్మీర్'​పై పాక్​ మళ్లీ అదే మాట

author img

By

Published : Jun 6, 2021, 1:00 PM IST

Updated : Jun 6, 2021, 3:55 PM IST

కశ్మీర్​(Jammu and Kashmir) అంశంపై ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో చర్చించనున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తెలిపారు. సమయం లభిస్తే.. 2022 మార్చిలో ఈ సమావేశం జరుగుతుందని అన్నారు.

shah mahamood qureshi
షా మహమ్మద్ ఖురేషి, పాక్ విదేశాంగ మంత్రి

కశ్మీర్(Jammu and Kashmir)​ తమ అంతర్గత వ్యవహారమని భారత్​ తేల్చిచెబుతున్నప్పటికీ.. పాకిస్థాన్​ వైఖరి మాత్రం మారడం లేదు. తాజాగా.. ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి కశ్మీర్(Jammu and Kashmir)​ అంశంపై చర్చిస్తానని పాక్​ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి వెల్లడించారు. వచ్చే ఏడాది ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.

"సమయం లభిస్తే.. 2022 మార్చిలో ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో చర్చ జరుపుతాం. కశ్మీర్​ అంశంపై చర్చించి వారి మద్దతు కూడగడతాం."

--షా మహమ్మద్ ఖురేషి, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి.

కించపరచొద్దు..

అఫ్గానిస్తాన్​ తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖురేషి ఆరోపించారు. పాక్​ ఓ వ్యభిచార గృహం అంటూ అఫ్గాన్ జాతీయ భద్రతా సలహాదారు చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:పాక్​లో కశ్మీర్​ ప్రస్తావనపై భారత్ మండిపాటు

Last Updated : Jun 6, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.