ETV Bharat / international

కరోనా విజృంభణతో ఆ దేశంలో మళ్లీ లాక్​డౌన్!

author img

By

Published : Aug 14, 2021, 10:25 PM IST

రోజురోజుకూ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ఇరాన్ నిర్ణయించింది. మహమ్మారిపై పోరులో భాగంగా చేపట్టిన టీకా కార్యక్రమం ఇరాన్​లో మందకొడిగా సాగుతుండటం దేశంలో కేసుల పెరుగుదలకు ఓ కారణమని నిపుణులు భావిస్తున్నారు.

కరోనా
కరోనా

ఇరాన్​లో కొవిడ్-19 మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఆరు రోజుల పాటు లాక్​డౌన్ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్​డౌన్​లో భాగంగా మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా థియేటర్లు, జిమ్‌లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయని మీడియా తెలిపింది. సోమవారం ప్రారంభమై శనివారం వరకు ఈ లాక్​డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు ఇరాన్ జాతీయ కరోనా వైరస్ టాస్క్​ఫోర్స్ దేశవ్యాప్తంగా ప్రయాణాలపై నిషేధాజ్ఞలు విధించింది.

టీకా పంపిణీలో తడబాటు..

ఇరాన్​లో శనివారం ఒక్కరోజే 29,700 కొత్త కేసులు బయటపడగా.. 466 మరణాలు సంభవించాయి. దీనితో దేశంలో మొత్తం కేసులు 4,389,085కి చేరాయి. మరణాల సంఖ్య 97,208కి చేరింది. టీకా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయాసలను ఎదుర్కొంటోంది. దేశంలోని 8 కోట్ల మందిలో 3.8 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు అందుకున్నారు.

ఇరాన్ తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​కి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే కరోనా నుంచి 85% రక్షణ ఇస్తుందని ప్రకటించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అగ్రరాజ్యం విలవిల..

అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. శుక్రవారం ఏకంగా లక్షా 55 వేల 297 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 769 మంది మరణించారు.

పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశం/ప్రపంచంమొత్తం కేసులుకొత్త కేసులుమొత్తం మరణాలు
ప్రపంచం207,229,274 721,1704,362,917
అమెరికా37,364,7001,55,2976,37,161
బ్రెజిల్20,319,00033,9335,67,914
రష్యా6,557,06822,2771,68,864
ఫ్రాన్స్6,425,43626,4531,12,561
బ్రిటన్6,211,49132,5741,30,801
మెక్సికో3,045,57124,9752,46,811

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.