ETV Bharat / international

‍‍‍ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు దాటిన కొవిడ్​ కేసులు

author img

By

Published : Aug 4, 2021, 6:58 AM IST

Updated : Aug 4, 2021, 7:27 AM IST

world coronavirus cases cross 20 crore mark
20 కోట్లను దాటిన కొవిడ్​ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్​ కేసులు 20 కోట్ల మార్క్​ను దాటాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 20 కోట్ల మార్కుని దాటాయి. నిన్న ఒక్కరోజే సుమారు 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 42,58,261 మంది చనిపోయారు. 18 కోట్లకు పైగా మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కోటి 54 లక్షలకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

తాజాగా అమెరికాలో అత్యధికంగా కొవిడ్​ కొత్త కేసులు లక్షకు పైగా నమోదయ్యాయి. 513 మంది వైరస్​తో చనిపోయారు. 32 వేలకు పైగా మంది కోలుకోగా... 56 లక్షలపైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. అగ్రరాజ్యంలో వైరస్​ అమాంతంగా పెరగడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఆయా దేశాల్లో కరోనా కేసులు ఇలా...

  • ఇరాన్​లో కొత్తగా 42వేల కేసులు వెలుగు చూశాయి. 378 మరణాలు నమోదయ్యాయి.
  • ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 1,598 మంది వైరస్​ ధాటికి చనిపోయారు. సుమారు 34 వేల కొత్తకేసులు నిర్ధరణ అయ్యాయి.
  • బ్రెజిల్​లో కొత్తగా 32 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,238 మంది కొవిడ్​ కాటుకు బలయ్యారు.
  • ఫ్రాన్స్​లో సుమారు 27వేల కేసులు నమోదు కాగా... 57 మంది మృత్యువాత పడ్డారు.
  • టర్కీలో కొత్తగా 25 వేల కేసులు వెలుగు చూశాయి. 126 మంది చనిపోయారు.

ఇదీ చూడండి: కరోనా విజృంభణ- మళ్లీ ఆంక్షల్లోకి అమెరికా నగరాలు!

Last Updated :Aug 4, 2021, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.