ETV Bharat / international

అంతరిక్ష కేంద్రంలోకి చైనా వ్యోమగాములు- 6 నెలలు అక్కడే..

author img

By

Published : Oct 16, 2021, 10:13 PM IST

Chinese astronauts enter space station for record six months stay
అంతరిక్ష కేంద్రంలోకి చైనా వ్యోమగాములు

సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే దిశగా చైనా (China Astronaut) మరింత ముందడుగు వేసింది. ఓ మహిళ సహా ముగ్గురు వ్యోమగాములు తియాన్హే అంతరిక్ష కేంద్రంలో (China space station) ప్రవేశించారు. 6 నెలల మిషన్​లో భాగంగా చైనా(China space station) మానవ సహిత అంతరిక్ష ప్రయోగం పట్టింది.

ఆరు నెలల మిషన్‌లో భాగంగా చైనా వ్యోమగాములు(China space station) అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. తియాన్హే వ్యోమనోక(China Astronaut) ద్వారా 55 ఏళ్ల ఝాయ్ ఝాయ్‌గాంగ్‌, మహిళా వ్యోమగామి 41ఏళ్ల వాంగ్‌ యాపింగ్, 41 ఏళ్ల యెగువాంగ్‌పు నిర్మాణంలో ఉన్న అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకుగాను 6 నెలలు అక్కడే ఉంటారు. ఇది చైనా అంతరిక్షచరిత్రలోనే సుదీర్ఘ మిషన్‌గా నిలవనుంది. చైనా అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన చైనా తొలి మహిళా వ్యోమగామిగా వాంగ్‌(China Astronaut) నిలిచారు.

Chinese astronauts enter space station for record six months stay
చైనా వ్యోమగాములు

చైనా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని ఈ తెల్లవారుజామున చేపట్టగా బీజింగ్‌ కాలమానం ప్రకారం వ్యోమనౌక 6.56 నిమిషాలకు అంతరిక్ష కేంద్రానికి చేరింది.

Chinese astronauts enter space station for record six months stay
అంతరిక్ష కేంద్రానికి వెళ్లే ముందు..

గోబీ ఏడారిలో ఉన్న జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌ మార్చ్‌ 2ఎఫ్​ రాకెట్‌ను(China Astronaut) అంతరిక్షంలోకి పంపింది. తియాన్‌జౌ-2 తియాన్‌జౌ-3 కార్గో క్రాప్ట్‌లతో ఓ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావటానికి దాదాపు 7 గంటల సమయం పట్టినట్లు చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ తెలిపింది.

Chinese astronauts enter space station for record six months stay
6 నెలల అంతరిక్ష కేంద్రంలో ఉండనున్న చైనా వ్యోమగాములు

టియాంగాంగ్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే చిన్న నోటీసు ద్వారా మరో అంతరిక్ష నౌకను పంపేందుకు చైనా అంతరిక్ష సంస్థ సిద్ధంగా ఉన్నట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు ఓ కథనంలో పేర్కొంది. వ్యోమగాములు 6 నెలల కాలంలో వందలాది ఏరోస్పేస్‌ ఔషధాలు, భౌతిక ప్రయోగాలతోపాటు రెండు నుంచి మూడు స్పేస్‌ వాక్‌లు చేయనున్నారు. భవిష్యత్‌ నిర్మాణ పనులు చేసేందుకు వీలుగా నూతన రోబోటిక్‌ ఆర్మ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది.

Chinese astronauts enter space station for record six months stay
తియాన్హే వ్యోమనౌక

సొంత అంతరిక్ష కేంద్రం..!

గత మిషన్‌China space station) కంటే ప్రస్తుత మిషన్‌కాలం దాదాపు రెండింతలని క్ర్యూ కమాండర్‌ ఝాయ్‌ తెలిపారు. ఇది వ్యోమగాములకు సవాల్‌ అని చెప్పారు. గురుత్వాకర్షణ లేకుండా 6 నెలలు అంతరిక్షంలో ఉండడం వ్యోమగాముల శారీరక, మానసిక ఆరోగ్యానికి, పరికరాల విశ్వసనీయతకు అగ్నిపరీక్ష అని ప్రయోగానికి ముందు ఝాయ్‌ తెలిపారు. నిర్మాణంలో ఉన్న అంతరిక్ష కేంద్రం కోసం చైనా చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయోగమిది. ఇంతకుముందు ముగ్గురు వ్యోమగాములు 3 నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి గతనెల 17న తిరిగి వచ్చారు. వీరు అంతరిక్ష కేంద్రంలో అనేక పనులు నిర్వహించారు. వచ్చే ఏడాదికల్లా ఈ అంతరిక్ష కేంద్రం సిద్ధమవుతుందని అంచనా. ఇది పూర్తయితే సొంత అంతరిక్ష కేంద్రం కలిగిన దేశంగా చైనా అవతరించనుంది.

ఇవీ చూడండి: 'బాయ్‌కాట్‌ 996'.. చైనాలో కొత్త ఉద్యమం

ప్రపంచంలో 230కోట్ల మందికి ఆ సౌకర్యాలు లేవు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.