ETV Bharat / international

'చైనా టీకా' వినియోగానికి షరతులతో అనుమతి

author img

By

Published : Dec 31, 2020, 10:02 AM IST

తమ దేశ ఔషధ తయారీ సంస్థ 'సినోఫార్మ్' అభివృద్ధి చేసిన కొవిడ్​ టీకా వినియోగానికి షరతులతో అనుమతించింది చైనా. ఈ టీకాను సినోఫార్మ్, బీజింగ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్​ సంయుక్తంగా తయారు చేశాయి.

Sinopharm vaccine gets conditional approval in china
'సినోఫార్మ్​'​ వినియోగానికి షరతులతో అనుమతి

ఔషధ సంస్థ సినోఫార్మ్ తయారు చేసిన కొవిడ్​ టీకా వినియోగానికి.. చైనా షరతులతో అనుమతించింది. కొవిడ్​ కట్టడి లక్ష్యంగా ఆ దేశం అభివృద్ధి చేసిన టీకాల్లో 'సినోఫార్మ్​' మొదట అనుమతి పొందడం గమనార్హం.

తమ సంస్థ అభివృద్ధి చేసిన టీకా సామర్థ్యం 79.34 శాతంగా ఉందని సినోఫార్మ్ అనుబంధ సంస్థ బీజింగ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ బయోలాజికల్ ప్రొడక్ట్స్ బుధవారం వెల్లడించింది. టీకా వినియోగానికి దరఖాస్తు చేసింది. రెండు డోసుల్లో వ్యాక్సిన్ లభిస్తుందని తెలిపింది. తొలిసారిగా బుధవారమే టీకా సామర్థ్యం గురించిన వివరాలను ఆ దేశం అందించింది.

ఇదీ చదవండి:మా టీకా సామర్థ్యం..79శాతం: చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.