ETV Bharat / international

చైనాలో మళ్లీ కరోనా భయాలు- ఆ నగరంలో అందరికీ టీకా

author img

By

Published : Apr 2, 2021, 1:12 PM IST

చైనా​ సరిహద్దు నగరం రూలీలో కరోనా కేసులు​ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో మూడు లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెగా వ్యాక్సినేషన్​​ కార్యక్రమం శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు సాగనుంది.

China aims to vaccinate entire city in 5 days after outbreak
చైనాలోని ఆ నగరంలో ప్రజలందరికీ టీకా!

చైనా​ సరిహద్దు నగరం రూలీలో కరోనా విజృంభిస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మహమ్మారిని నిలువరించేందుకు మొత్తం నగర జనాభా 3,00,000 మందికి టీకా పంపిణీ చేయాలని నిర్ణయించింది. లక్షా 59వేల టీకా డోసులు నగరానికి చేరుకున్నట్లు చైనా మీడియా 'సీసీటీవీ' పేర్కొంది. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యాక్సినేషన్​ కార్యక్రమం శుక్రవారం నుంచి మొదలైంది. ప్రజలు లైన్లలో నిలబడి టీకాలు తీసుకుంటున్న దృశ్యాలను చైనా మీడియా ప్రసారం చేసింది.

ఈ నగరంలో కొత్తగా 16 కేసులు వెలుగుచూశాయి. వారిలో పన్నెండు మంది చైనా పౌరులు కాగా.. మిగతా నలుగురు సరిహద్దు దేశం మయన్మార్ జాతీయులు.

మయన్మార్​ సరిహద్దుల నుంచి అక్రమంగా నగరంలోకి ప్రవేశించే వారిని అడ్డుకునేందుకు కఠిన నిబంధనలను రూపొందించనున్నట్లు నగర అధికారులు పేర్కొన్నారు. అలాగే నగర ప్రజలందరూ హోం​ క్వారంటైన్​లోనే ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైన వ్యాపారాలను మాత్రమే తెరచి ఉంచేందుకు అనుమతించారు.

ఇప్పటికే కరోనా సామాజిక వ్యాప్తిని పెద్దఎత్తున నియంత్రించిన చైనా.. మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్న నగరాల్లో పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇక తాజాగా మొదలైన కరోనా ఉద్ధృతిని నిలువరించేందుకు ఓ నగరం మొత్తం టీకా పంపిణీ చేపట్టడం ఇదే మొదటిసారి.

ఇవీ చదవండి: ఇంట్లోనే కరోనా టెస్టు- 20 నిమిషాల్లో ఫలితం!

కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.