ETV Bharat / international

'ప్రజల్లో విద్వేష వ్యాప్తి - 33 న్యూస్​ సైట్లపై నిషేధం!'

author img

By

Published : Jun 23, 2021, 11:28 AM IST

Updated : Jun 23, 2021, 12:02 PM IST

విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి ఎన్నికలను ప్రభావితం చేశాయని ఆరోపిస్తూ.. 33 ఇరాన్​ సైట్లపై నిషేధం విధించింది అమెరికా. 2020 అధ్యక్ష ఎన్నికల ముందునుంచే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాయని అధికారులు పేర్కొన్నారు.

Iran
ఇరాన్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్న కారణంగా ఇరాన్​ ఇస్లామిక్​ రేడియోకు చెందిన 33​ న్యూస్​ వెబ్​ సైట్లపై అమెరికా నిషేధం విధించింది. అక్టోబర్​లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో తప్పుడు కథనాల్ని ప్రసారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రయత్నించాయని యూఎస్​ న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అంతేకాకుండా ఈ సైట్లు అమెరికా కంపెనీల యాజమాన్యం కిందే ఉన్నా.. యూఎస్​ లైసెన్స్​ లేదని తేల్చింది. నిషేధం విధించిన వాటిలో మూడు సైట్లు.. పది సంవత్సరాల క్రితం నిషేధం విధించిన కటాయిబ్​ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందినవని వెల్లడించింది. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే న్యూస్​ సైట్లను అమెరికా నిషేధించిందని ఇరాన్​ స్టేట్​ రన్​ న్యూస్​ ఏజెన్సీ తెలిపింది.

ఇదీ చదవండి: Live Video: యుద్ధ నౌక పక్కనే భారీ పేలుడు

Last Updated : Jun 23, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.