ETV Bharat / international

మంచు తుపానులతో పాశ్చాత్య దేశాలు గజగజ

author img

By

Published : Feb 8, 2021, 4:34 PM IST

Updated : Feb 8, 2021, 5:28 PM IST

యూకేలో మంచు తుపాను ధాటికి ప్రజా రవాణా స్తంభించింది. టీకా పంపిణీని కూడా రద్దు చేశారు. ఈ తుపాను జర్మనీపైన కూడా ఉండటం వల్ల ఆ దేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివారం భారీగా మంచు కురిసింది.

Germany Snowstorms
మంచు తుపానుల ధాటికి వణుకుతున్న పాశ్చాత్య దేశాలు

అమెరికా, జర్మనీ, యూకే దేశాల్లో మంచు తుపాను వణికిస్తోంది. తుపాను ధాటికి పలు చోట్ల రవాణాను నిలిపి వేయగా.. పలు ప్రాంతాల్లో కొవిడ్​ టీకా పంపిణీని తాత్కాలికంగా రద్దు చేశారు.

మంచు తుపానులతో పాశ్చాత్య దేశాలు గజగజ

యూకేలో..

తూర్పు యూకేలో డార్సీ మంచు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. రష్యా నుంచి వచ్చిన ఈ తుపాను కారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుపాను ధాటికి రవాణా స్తంభించింది. రైళ్ల సేవలను నిలిపివేయగా, ప్రమాదకరంగా మారిన పలు రోడ్డు మార్గాలపై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రభావం టీకా పంపిణీ మీద కూడా పడింది. పలు చోట్ల ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కేంద్రాలను మూసేశారు. బుధవారం వరకు యూకే వాసులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావం యూకే సహా జర్మనీ, నెదర్లాండ్స్​ దేశాల మీద కూడా పడింది.

Germany Snowstorms
యూకేలో : వ్యాక్సిన్​ కేంద్రం మూసివేసినట్టు ప్రకటన

జర్మనీలో..

యూకే పరిస్థితే జర్మనీ కూడా ఎదుర్కొంటోంది. శనివారం రాత్రి ప్రారంభమైన మంచు తుపాను ధాటికి పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. కనిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా జర్మనీలో పలు ప్రాంతాల్లో ప్రమాదస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపేసిన అధికారులు.. ప్రజలు ఎవరూ కార్లలో ప్రయాణించవద్దని విజ్ఞప్తి చేశారు.

Germany Snowstorms
స్తంభించిన జర్మనీ

నార్త్​రైన్ -​ వెస్ట్​ఫేలియా రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం పొద్దున్న మధ్య 222 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. వీరిలో 26 మంది తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో మైనస్​ 20 డిగ్రీల ఉష్ణోగ్రత, 20 నుంచి 40 సెంటిమీటర్ల మధ్య మంచు నమోదయ్యాయి. గంటకు 70 కిలీమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుపాను ప్రభావం మరో వారం వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

అగ్రరాజ్యంలో..

అమెరికాలో ఇటీవల కాలంలో మంచు తుపానుల ప్రభావం తీవ్రంగా ఉంది. తాజాగా ఈశాన్య రాష్ట్రాల మీద ఆ ప్రభావం పడింది. ఈశాన్య న్యూజెర్సీ, వాయువ్య న్యూయార్క్, నైరుతి కనెక్టికట్ ప్రాంతాల్లో 5 నుంచి 7 అంగుళాల మేర హిమపాతం నమోదైంది. అత్యధికంగా పశ్చిమ ఫిలడెల్​ఫియాలో 9 అంగుళాలు మేర మంచు కురిసింది. స్థానికులంతా బయటకు వచ్చి, మంచులో ఆడుతూ ఆహ్లాదంగా మారిన వాతావరణాన్ని ఆస్వాదించారు.

Germany Snowstorms
అమెరికాలో ఇలా..

ఆదివారం కురిసిన మంచుపై న్యూయార్క్ నగర మేయర్​ స్పందించారు. టీకా పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగదన్నారు. ఇదివరకు సంభవించిన తుపాను కారణంగా టీకా పంపిణీ రద్దు చేసిన నేపథ్యంలో మేయర్ ఈ విధంగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి : అమెరికా జైలులో ఖైదీల విధ్వంస కాండ

Last Updated : Feb 8, 2021, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.