ETV Bharat / international

అమెరికా, బ్రెజిల్​లో ఆగని కరోనా ఉద్ధృతి

author img

By

Published : Sep 6, 2020, 8:32 AM IST

Coronavirus cases increased to 2.70 crores in world wide
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.69 లక్షల మందికి కరోనా

ప్రపంచదేశాలపై కొవిడ్​-19 అంతకంతకూ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే సుమారు 2 లక్షల 69వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 2కోట్ల 70లక్షలకు ఎగబాకింది. వైరస్​తో మరో 4,800 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 8లక్షల 83వేలు దాటింది.

ప్రపంచవ్యాప్తంగా ఆందోళకర స్థాయిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ 2కోట్ల 70లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. శనివారం ఒక్కరోజే 2లక్షల 69వేల మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. కొత్తగా 4,822 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 8.83 లక్షలకు పెరిగింది.

మహమ్మారి సోకిన వారిలో ఇప్పటివరకు 1.91కోట్ల మంది కోలుకున్నారు. మరో 70 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  1. మొత్తం కేసులు : 27,054,164
  2. మొత్తం మరణాలు : 883,176
  3. యాక్టివ్ కేసులు : 7,015,051
  4. రికవరీలు : 19,155,937
  • అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 42,095 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 64,31,152కు పెరిగింది. మరో 707 మంది వైరస్​ కారణంగా మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1,92,818కు చేరింది.
  • బ్రెజిల్​లో తాజాగా 31,199 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. బాధితుల సంఖ్య 41,23,000లకు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 646మంది బలవ్వగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,26,230కు పెరిగింది.

ఆయా దేశాలపై కరోనా వ్యాప్తి కొనసాగుతోందిలా..

దేశంమొత్తం కేసులుమొత్తం మరణాలు
అమెరికా6,431,152192,818
బ్రెజిల్​4,123,000126,230
రష్యా1,020,31017,759
పెరూ683,70229,687
కొలంబియా658,45621,156
దక్షిణాఫ్రికా636,88414,779
మెక్సికో623,09066,851

ఇదీ చదవండి: మెరుగైన రక్షణ కల్పించే పునర్వినియోగ మాస్కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.