ETV Bharat / international

మెరుగైన రక్షణ కల్పించే పునర్వినియోగ మాస్కు

author img

By

Published : Sep 6, 2020, 5:04 AM IST

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు మాస్కు తప్పనిసరిగా ధరించాలి. ఆ మాస్కు సరిగా లేకుంటే.. అది ధరించిన వారితో పాటు పక్కవారికి ప్రమాదమే. ఈ క్రమంలో కరోనా నుంచి రక్షణ కల్పించే కొత్త రకం పునర్వినియోగ మాస్కును రూపొందించారు అమెరికా శాస్త్రవేత్తలు. ఆ మాస్కు విశేషాలు తెలుసుకుందాం.

Scientists redesign face mask to improve comfort
మెరుగైన రక్షణ కల్పించే పునర్వినియోగ మాస్కు

కరోనా నుంచి రక్షణ కల్పించే కొత్త రకం పునర్వినియోగ మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని ధరించినవారినే కాకుండా పక్కవాళ్లనూ వైరస్‌ బారి నుంచి ఇది కాపాడుతుంది. పైగా రోజంతా ధరించడానికి అనువుగా ఉంటుంది. కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని చెబుతున్నారు.

ఈ పరిశోధన బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త సుందరేశన్‌ జయరామన్‌ కూడా ఉన్నారు. జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ మాస్కును అభివృద్ధి చేశారు.

" ప్రస్తుత పునర్వినియోగ క్లాత్‌ మాస్కుల అంచుల గుండా గాలి లీకవుతోంది. ఈ ఖాళీల నుంచి తుంపర్లు, చిన్నపాటి ఏరోసాల్స్‌ ద్వారా వైరస్‌ రేణువులు.. ముక్కులోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తులు ఇలాంటి మాస్కు ధరిస్తే.. వారి నుంచి వైరస్‌ చాలా తేలిగ్గా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. వీటిని ధరించిన వారి కళ్లజోడు అద్దాలపై పొగమంచు ఏర్పడటానికి కూడా ఈ తొడుగులు కారణమవుతున్నాయి. ముఖానికి సరిగా అమరకపోవడం వల్ల.. తరచూ ఈ మాస్కులను సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. వేరే వస్తువులను పట్టుకున్నాక ఇలా మాస్కును సరిచేసుకునే సందర్భంలో వైరస్‌ అంటుకునే ప్రమాదం లేకపోలేదు."

- సుందరేశన్‌ జయరామన్‌, భారత సంతతి శాస్త్రవేత్త

వడకట్టే పదార్థంతో కలిపి..

సాగే లక్షణమున్న వస్త్రాన్ని వడకట్టే పదార్థంతో కలపడం ద్వారా సరికొత్త పునర్వినియోగ మాస్కును రూపొందించారు శాస్త్రవేత్తలు. స్పాండెక్స్‌, పాలిస్టర్‌ల మిశ్రమంతో ఇది తయారైంది. ఫలితంగా ఈ మాస్కు నిర్దిష్ట స్థానంలో స్థిరంగా ఉంటుంది. అదే సమయంలో శ్వాస తీసుకోవడానికి, మాట్లాడడానికి ఇబ్బంది లేకుండా ముక్కు, నోరు భాగంలో కొంత ఖాళీ ఉండేలా డిజైన్‌ చేశారు. తల వెనుక భాగంలో దీని పట్టీలు పటిష్ఠంగా ఉండటానికి హుక్‌, ఐ ఫాస్టనర్స్‌ను ఏర్పాటు చేశారు. అవసరమైతే ప్రత్యేక ఫిల్టర్‌ను ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఈ మాస్కులో ఒక అరనూ అమర్చారు. తేమను పీల్చుకునే స్వభావం కూడా దీని సొంతం. 20 సార్లు ఉతికినా ఇది పటిష్ఠంగానే ఉంది.

ఇదీ చూడండి: 'బుల్లెట్‌' ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.