ETV Bharat / entertainment

'విరాటపర్వం','గాడ్సే' ఈ వారమే.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే?

author img

By

Published : Jun 14, 2022, 10:25 AM IST

virataparvam
విరాటపర్వం గాడ్సే

This week Upcoming movies: బాక్సాఫీస్‌ వద్ద వేసవి చిత్రాల జోరు కొనసాగుతోంది. ప్రతి వారం సరికొత్త చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో సందడి చేసే చిత్రాలేవో చూసేద్దాం..

This week Upcoming movies: ప్రతివారంలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో తెలుసుకుందాం..

విరాట పర్వం.. సాయిపల్లవితో కలిసి రానా కీలక పాత్రలో నటించిన చిత్రం 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకుడు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నక్సలిజం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథ ఈ చిత్రం. 1990ల్లో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో కామ్రేడ్‌ రవన్నగా రానా కనిపిస్తారు. ఆయన ప్రేయసి వెన్నెలగా సాయిపల్లవి నటించారు. ఈ సినిమాని సురేశ్‌ ప్రొడక్షన్‌, ఎస్‌ఎల్‌వీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గాడ్సే.. "సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయ్‌, వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయ్‌, వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయ్‌. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్‌?" అని ప్రశ్నించాడు ఓ యువకుడు. అతనెవరో తెలియాలంటే 'గాడ్సే' చూడాల్సిందే. సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. గోపీ గణేష్‌ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు. సి.కల్యాణ్‌ నిర్మాత. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు జూన్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

'కిరోసిన్‌'.. ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ నిర్మించారు. జూన్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు 'హీరో', 'మొనగాడు' తదితర చిత్రాలు కూడా థియేటర్లలో అలరించనున్నాయి.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!
ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్ర ధారిగా... విజయ్‌కుమార్‌ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్‌ 14 నుంచి 'జయమ్మ పంచాయితీ' ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ సినిమాకు స్వరాలు అందించారు.

రెక్కీ.. శ్రీరామ్‌, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించిన వెబ్​సిరీస్​ 'రెక్కీ'. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ 'జీ5'లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 1990ల్లో తాడిపత్రిలో చోటుచేసుకున్న కొన్ని సంఘటల ఆధారంగా రూపొందిన సిరీస్‌ ఇది. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ హత్యకు ఎవరెలా ప్రణాళిక రచించారు? ఈ కేసును పోలీసు అధికారులు ఎలా ఛేదించారనే కథాంశంతో రాబోతుంది.

నయనతార 'o2'.. నయనతార కీలక పాత్రలో జీఎస్‌ విఘ్నేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'O2'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో జూన్‌ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కొడుకుతో కలిసి నయనతార ప్రయాణం చేస్తున్న బస్సు అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటుంది. కొండచరియలు విరిగి పడటంతో బస్సు పూర్తిగా భూమిలోపల కూరుకుపోతుంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించదు. పైగా ఆక్సిజన్‌ కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ బస్సులోని వారు ఏం చేశారు? ఆక్సిజన్‌ కోసం ఒకరి ప్రాణాలను మరొకరు ఎలా తీశారు? చుట్టూ ఉన్న వారి నుంచి నయనతార తన కొడుకుని ఎలా కాపాడుకుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అమెజాన్‌ ప్రైమ్‌
* అవతార పురుషా-1 (కన్నడ) జూన్‌ 14

* సుజల్‌ (తమిళ సిరీస్‌2) జూన్‌ 17

నెట్‌ఫ్లిక్స్‌
* గాడ్స్‌ ఫేవరెట్‌ ఇడియట్‌ (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 15

* ది రాత్‌ ఆఫ్‌ గాడ్‌ (హాలీవుడ్‌)జూన్‌ 15

* షి (హిందీ సిరీస్‌2) జూన్‌ 17

* ఆపరేషన్‌ రోమియో (హిందీ) జూన్‌ 18

* సీబీఐ 5ద బ్రెయిన్‌ (మలయాళీ చిత్రం) జూన్‌18
సోనీలివ్‌

* సాల్ట్‌ సిటీ (హిందీ సిరీస్‌) జూన్‌ 16
జీ5

* ఇన్ఫినీట్‌ స్టోర్మ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 14

* ఫింగర్‌ టిప్‌ (హిందీ, తమిళ సిరీస్‌) జూన్‌ 17
బుక్‌ మై షో

* పారలర్‌ మదర్స్‌ (స్పానిష్‌) జూన్‌ 17

ఇదీ చూడండి: దర్శకనిర్మాతలకు నయనతార కండిషన్​.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.