ETV Bharat / entertainment

దర్శకనిర్మాతలకు నయనతార కండిషన్​.. కారణమిదే!

author img

By

Published : Jun 14, 2022, 10:10 AM IST

Updated : Jun 14, 2022, 1:30 PM IST

Nayanthara condition to producers: ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్​ నయనతార తన దర్శకనిర్మాతలకు ఓ కండిషన్​ పెట్టినట్లు తెలిసింది. అదేంటంటే..

nayantara marriage
నయనతార పెళ్లి

Nayanthara condition to producers: హీరోయిన్​ నయనతార ఇటీవలే తన ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్​ శివన్​ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సెలబ్రిటీల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ తన దర్శకనిర్మాతలందరికీ ఓ కొత్త కండిషన్​ పెట్టినట్లు తెలిసింది. ఇకపై తాను నటించే సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోబోతుందట. రొమాన్స్ సన్నివేశాలలో నటించనని, కేవలం మంచి సబ్జెక్ట్​ ఓరియెంటెడ్​​ ఫిల్మ్స్ మాత్రమే చేస్తానని చెప్పినట్లు సమాచారం. అలానే ఎక్కువ డేట్స్​ కూడా ఇవ్వనని చెప్పినట్లు టాక్​. కాగా, నయనతార ప్రస్తుతం 'O2', 'గోల్డ్'​, షారుక్ 'జవాన్'​, చిరంజీవి 'గాడ్​ఫాదర్'​, 'కనెక్ట్'​ చిత్రాల్లో నటిస్తోంది.

కాగా, నయనతార పెళ్లి.. మహాబలిపురంలోని ఓ స్టార్‌ హోటల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. పురోహితుల సమక్షంలో నయనతార మెడలో తాళికట్టారు విఘ్నేశ్‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, షారుక్‌ఖాన్‌, మణిరత్నం, సూర్య, కార్తి, విజయ్‌సేతుపతి, శరత్‌కుమార్‌, రాధికా శరత్‌కుమార్‌, అజిత్‌ భార్య షాలిని, ఖుష్బూ, ఏఆర్‌రెహ్మాన్‌, అనిరుధ్‌, కేఎస్‌ రవికుమార్‌, అట్లి, ఎడిటర్‌ మోహన్‌ తదితరులు పెళ్లికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇదీ చూడండి: గవర్నమెంట్​ జాబ్ వదిలేసి వచ్చా... లేడీ గెటప్స్​తో మహా టార్చర్​!

Last Updated : Jun 14, 2022, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.