ETV Bharat / entertainment

సూర్య-బాలా మూవీ నిలిపివేత.. మలేషియాకు చిరు మూవీటీమ్​​!

author img

By

Published : May 25, 2022, 5:54 PM IST

Updated : May 25, 2022, 6:38 PM IST

Suriya Bala movie Budget problem
Suriya Bala movie Budget problem

Suriya Bala movie Budget problem: మరికొన్ని సినిమా కబుర్లు వచ్చాయి. సూర్య-బాల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్​కు బడ్జెట్​ సమ్యస తలెత్తినట్లు తెలిసింది. దీంతో తాత్కాలికంగా చిత్రీకరణను నిలిపివేశారట! చిరంజీవి 'వాల్తేర్​ వీరయ్య' మూవీటీమ్​ షూటింగ్​ కోసం మలేషియా వెళ్లనున్నట్లు సమాచారం.

Suriya Bala movie Budget problem: విభిన్న సినిమాల దర్శకుడు బాలాతో కథానాయకుడు సూర్య ఓ సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ కూడా ఇటీవలే పూర్తైంది. అయితే ఇప్పుడీ సినిమా షూటింగ్​కు తాత్కాలికంగా బ్రేక్​ పడినట్లు తెలిసింది. బడ్జెట్​ సమస్యలు ఎదురైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నారట. దీంతో బడ్జెట్​ పెరిగే అవకాశాలు ఉన్న కారణంగా తాత్కాలికంగా చిత్రీకరణను నిలిపివేసి.. ఈ విషయమై చర్చలు జరుపుతున్నారట. మరి సినిమాను ఓ భాగానికే కుదించాలా లేదా బడ్జెట్​ లెక్కల్ని అంచనా వేసి రెండు భాగాలుగా రూపొందించాలా అనేది ఆలోచిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్​ అయింది. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కాగా, ఈ మూవీలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఓ పాత్రలో మత్స్యకారుడిగా కనిపిస్తారని అంతా మాట్లాడుకున్నారు. 19 ఏళ్ల తర్వాత బాలా, సూర్య కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడం వల్ల దీనిపై భారీ అంచనాలున్నాయి. జి.వి ప్రకాష్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Chiranjeevi movie team Malaysia: బాబీ దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి హీరోగా 'వాల్తేర్​ వీరయ్య' సినిమా తెరకెక్కుతోంది. మాస్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుల నాయకుడిగా కనిపించనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం విదేశాల్లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు మూవీటీమ్​ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం చిత్రబృందం​ మలేషియాకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్​ సంగీతమందిస్తున్నారు. శ్రుతిహాసన్​ హీరోయిన్​. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి: 'సీతారామం' రిలీజ్​ డేట్​.. 'ఎఫ్​ 3' మేకింగ్ వీడియో.. 'డాన్​' 100కోట్లు

Last Updated :May 25, 2022, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.