ETV Bharat / entertainment

పుత్రోత్సాహంలో షారుక్​.. ఆ​ పోటీల్లో చిన్న కుమారుడు గెలుపు

author img

By

Published : Oct 17, 2022, 5:56 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్​ ఖాన్​ కుమారుడు అబ్​రామ్​.. తైక్వాండో పోటీల్లో గెలిచాడు. ఈ పోటీల్లో అబ్​రామ్​​తో పాటు ఇతర స్టార్ల పిల్లలు కూడా పాల్గొన్నారు.

SRK at Abram Taekwando competition
SRK at Abram Taekwando competition

బాలీవుడ్ స్టార్​ హీరో షారుక్​​ ఖాన్​ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. తాజాగా ఆయన రెండో కుమారుడు అబ్​రామ్.. తైక్వాండో పోటీల్లో గెలిచాడు. దీంతో షారుక్ తన కుమారుడిని చూసి ఆనందంతో మురిసిపోయారు.​ అయితే ఈ పోటీల్లో అబ్​రామ్​తో పాటు ఇతర ప్రముఖ తారల పిల్లలు కూడా పాల్గొన్నారు. వీరిలో కరీనా కుమారుడు తైమూర్​, కరీష్మా కపూర్​ కొడుకు వియాన్ రాజ్​కపూర్​, నిఖిల్​ ద్వివేది తనయుడు శివాన్​ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ పోటీలకు షారుక్​-గౌరీ ఖాన్ దంపతులు.. వీరి పెద్ద కుమారుడు ఆర్యన్​ ఖాన్, కుమార్తె సుహానా కూడా హాజరయ్యారు.

కాగా, షారుక్​​ పెద్ద కుమారుడు ఆర్యన్​.. ఓ వెబ్​సిరీస్​కు రైటర్​గా పనిచేయనున్నాడు. ఈ సిరీస్​తో చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నాడు. ఇక షారుక్​ కుమార్తె సుహానా త్వరలోనే సిల్వర్​ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనుంది. జోయా అక్తర్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతోనే శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్, అమితాబ్​ బచ్చన్​ మనవడు అగస్త్య నంద తెరంగేట్రం చేయనున్నారు.

ఇవీ చదవండి : వారికి సంఘీభావంగా జట్టు కత్తిరించుకున్న ఊర్వశి​.. కానీ బుక్​ అయిందిగా!

దర్శకుడిగా మారనున్న హీరో కార్తి.. అన్నయ్యతో సినిమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.