ETV Bharat / entertainment

'శివ సినిమా తీసిన రామ్​గోపాల్​ వర్మ చనిపోయాడు'

author img

By

Published : May 4, 2022, 7:32 PM IST

Updated : May 4, 2022, 10:48 PM IST

'శివ సినిమా తీసిన రామ్​గోపాల్​ వర్మ చనిపోయాడు'.. ఈ మాట అన్న అన్నది ఎవరో కాదు. స్వయంగా ఆర్జీవీనే ఈ మాట అన్నారు. ఇంతకీ ఆయన ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అసలేమైంది?

RGV
RGV

'శివ'.. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఈ సినిమా గుర్తుంటుంది. నాగార్జున హీరోగా రామ్​గోపాల్​ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీకి సంబంధించి.. ఓ ప్రశ్న ఎదురైనప్పుడు ఆర్​జీవీ ఆసక్తికర కామెంట్స్​ చేశారు. 'శివ సినిమా తీసిన రామ్​గోపాల్​ వర్మ చనిపోయాడు' అని స్టేట్​మెంట్​ ఇచ్చారు. ఈటీవీలో ప్రసారం అయ్యే 'ఆలీతో సరదా'గా కార్యక్రమానికి ఈ వారం అతిథిగా రామ్​గోపాల్​ వర్మతో పాటు తను ఇటీవల తెరకెక్కించిన డేంజరెస్​ సినిమాలోని హీరోయిన్లు అప్సర వాణి, నైనా గంగూలీ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు వర్మ. 'మీరు సీఎం అయితే ఏం చేస్తారు' అని ఆర్జీవీని అలీ అడిగారు. ' ట్రెజరీలో ఉన్న డబ్బంతా తీసుకొని.. వేరే దేశానికి వెళ్లిపోతా' అని ఆర్జీవీ సమాధానం చెప్పారు. ఈ కొత్త ఎపిసోడ్​ ఈ నెల 9న ప్రసారం కానుంది. స్వలింగసంపర్కుల కథాంశంతో డేంజరెస్​ సినిమాను తెరకెక్కించారు రామ్​గోపాల్​ వర్మ. అయితే సినిమాపై వివాదం చెలరేగుతుండగా.. విడుదల వాయిదా పడుతూ.. వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 6న ఎలాగైనా విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఇది విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: RRR: అనుకున్న తేదీకి ముందే ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. కానీ ఓ కండీషన్​!

Last Updated :May 4, 2022, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.