ETV Bharat / entertainment

'మీ హార్ట్ బ్రేక్ చేస్తున్నందుకు సారీ, ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు'!: మృణాల్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 9:00 PM IST

Updated : Nov 4, 2023, 8:19 AM IST

Mrunal Thakur Marriage : సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. కొంతకాలంగా తన పెళ్లి విషయంపై వస్తున్న రూమర్స్​పై స్పందించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. మరి ఆమె ఏమన్నారంటే?

Mrunal Thakur Wedding
Mrunal Thakur Wedding

Mrunal Thakur Marriage : స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే కెరీర్​లో ఎదుగుతున్న సమయంలో సెలబ్రిటీల గురించి రూమర్స్ రావడం కామన్. అలాగే నటి మృణాల్ గురించి కూడా.. కొన్ని రోజుల క్రితం ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ఆమె ఓ తెలుగు అబ్బాయిని పెళ్లాడబోతున్నారంటూ.. పలు వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మృణాల్ స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

తనపై వస్తున్న రూమర్స్​ను కొట్టిపడేశారు నటి మృణాల్ ఠాకూర్. శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వాటన్నింటికీ చెక్ పెట్టారు. ' హాయ్! మీ హార్ట్ బ్రేక్ చేస్తున్నందుకు ఐయామ్ సో సారి గాయ్స్​.. నా ఫ్రెండ్స్​, డిజైనర్స్‌, రిలేటివ్స్ వరుసగా ఫోన్‌కాల్స్‌ చేసి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. మరి అతడు ఎవరో నాక్కూడా తెలుసుకోవాలని ఉంది. ఈ ఫన్నీ రూమర్ గురించి ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. అయితే అబ్బాయిని మీరే వెతికి, కల్యాణ వేదిక, లోకేషన్ షేర్ చేయండి' అని మృణాల్ ఇన్​స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్​ చేశారు.

మృణాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో నేచురల్ స్టార్ నానితో కలిసి 'హాయ్ నాన్న' సినిమాలో నటిస్తున్నారు. డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్​తో రానున్న ఈ మూవీలో మృణాల్.. పాత్ర ఎంతో కీలకమని ఇన్​సైట్ టాక్. పెళ్లికి ముందు హీరోతో లవ్​లో పడిన అమ్మాయి పాత్రలో మృణాల్ కనిపించనున్నారు. ఇక రీసెంట్​గా రిలీజైన టీజర్.. ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. వీరిద్దరి మధ్య ఫీల్​గుడ్​ లవ్​స్టోరీతో పాటు కెమీస్ట్రీ కూడా బాగుందని టీజర్ చూసిన నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మరోవైపు రౌడీబాయ్ విజయ్ దేవరకొండ సరసన 'ఫ్యామిలీ మ్యాన్' సినిమాలోనూ నటిస్తున్నారు.

Mrunal Thakur Upcoming Movies : మృణాల్​​ ఠాకూర్ భవిష్యత్​​.. ఆ రెండిటిపైనే భారీ ఆశలు!

Mrunal Thakur Marriage : మృణాల్ ఠాకూర్​కు అలాంటోడు కావాలంట.. మీలో అలా ఎవరైనా ఉన్నారా?

Last Updated :Nov 4, 2023, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.