ETV Bharat / entertainment

సినిమా అప్డేట్​పై నవీన్​ పోలిశెట్టి ఫన్నీ వీడియో.. చూస్తే పొట్ట చెక్కలే!

author img

By

Published : Dec 31, 2022, 10:32 PM IST

'యంగ్ సెన్సేషన్' నవీన్​ పోలిశెట్టి కొత్త సంవత్సరం సందర్భంగా ఓ వీడియోను రిలీజ్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలోని నవీన్​ హావభావాలు నవ్వులు పూయిస్తున్నాయి. మీరూ చూసేయండి.

naveen polishetty
naveen polishetty

నవీన్​ పోలిశెట్టి.. క్యారక్టర్​ ఆర్టిస్ట్​గా కెరీర్ మొదలు పెట్టి సుధీర్ఘ కాలం తర్వాత ఏజెంట్​ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్​ అందుకున్నాడు. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు. చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ 'యంగ్​ సెన్సేషన్​' సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు ఓ వీడియోతో అప్టేట్​ ఇచ్చారు. అందులో తనదైన కామెడీ టైమింగ్​తో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇప్పుడు కొత్త ఏడాదిలోనైనా ఫ్రెష్‌ ఏమైనా అప్‌డేట్ ఉంటుందా? అదే విషయంపై నవీన్‌.. ఓ వీడియో షేర్​ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ప్రేక్షకులను నవ్వులు పూయిస్తోంది.

naveen polishetty
నవీన్​ పోలిశెట్టి

ఈ వీడియోలో నవీన్​ను అందరూ.. అప్డేట్​ ఎప్పుడూ అని అడుగుతుంటారు. దానికి ఈ హీరో సమాధానం దాటవేస్తూ చేసిన హావభావాలు నవ్వు తెప్పిస్తోంది. కాగా, 2022లో సినిమాను రిలీజ్​ చేయని నవీన్​.. పెండింగ్​ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుని కొత్త ఏడాదిలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం నవీన్​ పోలిశెట్టి యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అనుష్కతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇదే కాకుండా సితార ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై 'అనగనగా ఒక రాజు' అనే సినిమా చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.