ETV Bharat / sports

రిషభ్​ పంత్​ హెల్త్​ అప్డేట్​.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

author img

By

Published : Dec 31, 2022, 4:40 PM IST

Updated : Dec 31, 2022, 5:09 PM IST

Rishabh Pant Accident : శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీమ్​ఇండియా ప్లేయర్​ రిషభ్​​​​ పంత్​ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నపంత్‌ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐతో పాటు దిల్లీ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్​(డీడీసీఏ) నిశితంగా పరిశీలిస్తోంది. అయితే శనివారం పంత్​ ఆరోగ్యంపై మరో హెల్త్​ అప్డేట్​ వచ్చింది.

Rishab Pant Plastic Surgery
Rishab Pant

Rishabh Pant Accident : రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై దెహ్రాదూన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు ప్లాస్టిక్‌ సర్జరీ జరిపినట్లు దిల్లీ క్రికెట్‌ అసోసియేషన్ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ తెలిపారు. ముఖం మీద అయిన గాయాలకు ఈ సర్జరీని చేసినట్లు ఆయన తెలిపారు. తొలుత ఆపరేషన్​ కోసం ఎయిర్‌ అంబులెన్స్‌లో దిల్లీకి తీసుకెళ్లాలని భావించినప్పటికీ.. దెహ్రాదూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలోనే శస్త్రచికిత్సను చేసినట్లుగా వైద్యులు చెప్పారు. వీటికి సంబంధించి పంత్​ హెల్త్ కండిషన్​ను శ్యామ్‌ శర్మ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

దిల్లీ నుంచి దెహ్రాదూన్‌ వెళ్లిన ''డీడీసీఏ బృందం ఆసుపత్రికి వెళ్లి రిషభ్‌ పంత్​ను పరామర్మించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంది. ప్లాస్టిక్‌ సర్జరీ అత్యవసరం కావడంతో ముందుగానే చేర్చిన ఆసుపత్రిలోనే వైద్యులు ఆపరేషన్​ను పూర్తి చేసినట్లు శర్మ తెలిపారు. ప్రాథమిక చికిత్స తర్వాత తీసిన ఎక్స్‌రేల్లో పంత్‌ కుడి కాలు లిగ్మెంట్‌ పక్కకు జరగడం, నుదురు భాగంలో చిట్లిన గాయాలు ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. అలాగే మెదడు, వెన్నెముకకు సంబంధించిన ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఎలాంటి సమస్య లేదని, అంతా మామూలుగానే ఉన్నట్లు వైద్యులు హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు. ప్రమాదానికి సంబంధించి సోషల్‌ మీడియాలో వచ్చిన సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ప్రకారం.. పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టిన క్షణాల్లోనే మంటలు అంటుకొన్నట్లు తెలుస్తోంది. అయితే హైవేలో ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు వెంటనే పంత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

పంత్‌ను కాపాడిన వారిని సత్కరిస్తాం..
ఉత్తరాఖండ్ డీజీపీజాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన పంత్‌ను వెంటనే కాపాడి ఆసుపత్రికి తరలించిన స్థానికులను తప్పకుండా సత్కరిస్తామని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్‌ అన్నారు. రోడ్డు, రవాణా, హైవేస్​ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'గుడ్‌ సమరితాన్' పథకం కింద గౌరవిస్తామని తెలిపారు. "రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంట సమయం బాధితుడికి చాలా కీలకం. ఆ సమయంలో ట్రీట్‌మెంట్‌ అందిస్తే ప్రాణాలకు ప్రమాదం లేకుండా చూడొచ్చు. ఇలాంటి సామాజిక పరివర్తనను ప్రతి ఒక్కరిలో కల్పించడానికి ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగింది. ఇలా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సహాయం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా"అని డీజీపీ పేర్కొన్నారు.

రిషభ్‌ పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ, దిల్లీ క్రికెట్ బోర్డు పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. నుదిటిపై అయిన గాయాలకు ప్లాస్టిక్‌ సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో పంత్‌ను పరామర్శించేందుకు సీనియర్‌ బాలీవుడ్ నటులు దెహ్రాదూన్‌ వెళ్లారు.

రిషభ్​ పంత్​కు అనుపమ్​ ఖేర్​ పరామర్శ..
రిషభ్‌పంత్‌ని బాలీవుడ్‌ నటులు అనిల్‌ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌ పరామర్శించారు. పంత్‌ అద్భుతమైన వ్యక్తి అని అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. "రిషభ్‌ పంత్ ఆసుపత్రిలో ఉన్నాడని తెలుసుకొని సాధారణ పౌరులుగా ఇక్కడికి వచ్చాం. రిషభ్‌ పంత్ ఎలా ఉన్నాడో చూశాం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. పంత్ తల్లిని కలిశాం. రిషభ్‌ అద్భుతమైన వ్యక్తి. ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఇప్పుడు దేశమంతా అతడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తోంది. త్వరలోనే అతడి కోలుకొని వస్తాడని ఆశిస్తున్నాం. అతడి తల్లిని, కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాం. వారిని కాసేపు నవ్వించాం. అతడి అభిమానుల్లా మేము ఇక్కడికి వచ్చాం. పంత్‌ త్వరగా కోలుకునేలా అందరూ ప్రార్థించండి" అని అనిల్‌, అనుపమ్‌ పేర్కొన్నారు.
"దయచేసి అందరూ బాధ్యతాయుతమైన పౌరులుగా జాగ్రత్తగా డ్రైవ్‌ చేయండి. ముఖ్యంగా రాత్రి సమయంలో పొగమంచు ఉంటుంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండండి" అని బాలీవుడ్ సీనియర్‌ నటులు సూచించారు.

Last Updated :Dec 31, 2022, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.