పంత్‌ను కాపాడిన RTC బస్సు డ్రైవర్​.. రోడ్డు ప్రమాదంపై మోదీ విచారం

author img

By

Published : Dec 30, 2022, 6:46 PM IST

Rishab Pant Saved By Bus Driver

రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్​ఇండియా క్రికెటర్​ రిషభ్​ పంత్‌ను ఒక బస్సుడ్రైవర్‌ తొలుత చూసి కాపాడాడు. పంత్‌ అప్పుడు నడవలేని స్థితిలో ఉన్నట్లు అతడు చెప్పాడు. మరోవైపు, పంత్​ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు.

Pant Accident Bus Driver: టీమ్​ఇండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను ఓ బస్సు డ్రైవర్‌ ప్రమాదం నుంచి రక్షించాడు. శుక్రవారం ఉదయం రూర్కీ సమీపంలో పంత్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ బస్సును సుశీల్‌ మాన్‌ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఈ ప్రమాదాన్ని చూసిన మొదటి వ్యక్తి సుశీల్​. ప్రమాదం చూసిన వెంటనే బస్సులో నుంచి దిగి కారులో చిక్కుకున్న పంత్​ను బయటకు తీశాడు. అప్పటికే కారుకు మంటలు అంటుకున్నాయని సుశీల్​ తెలిపాడు. కాగా పంత్‌ తీవ్రంగా గాయపడి నడిచేందుకు కూడా ఇబ్బంది పడినట్లు సుశీల్​ మాన్​ చెప్పాడు.

ఆ సమయంలో తాను హరిద్వార్‌ వైపు నుంచి వస్తున్నానని.. పంత్‌ కారు దిల్లీ వైపు ఉత్తరాఖండ్​కు వస్తోందని సుశీల్‌ తెలిపాడు. కాగా పంత్‌ కారు డివైడర్‌ను ఢీకొని దాదాపు 200 మీటర్ల దూరంలో పడింది, దీంతో వెంటనే నా బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రమాదం జరిగిన కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాను.అయితే ముందుగా కారు బోల్తాపడిందనుకున్నాను. పంత్‌ అప్పటికే కారు అద్దంలో నుంచి సగం బయటకు వచ్చి తాను క్రికెటర్‌నని చెప్పి తన తల్లికి ఫోన్​ చెయమని కోరాడు. తాను క్రికెట్ చూడనని అందుకని గుర్తుపట్టలేకపోయానని సుశీల్​ తెలిపాడు. అయితే తన బస్సులో వచ్చిన ప్రయాణికులు కొందరు పంత్​ను గుర్తుపట్టి కారులో నుంచి బయటకు లాగారు. కారులో ఇంకెవరైనా ఉన్నారేమో అని చూశాము. వెంటనే అంబులెన్స్​కి సమాచారం ఇచ్చి దేహ్రాదూన్‌ అసుపత్రికి పంపించాము అని డ్రైవర్​ చెప్పాడు. పంత్​ కారులో నీలి రంగు బ్యాగులో రూ.7000 క్యాష్​ కూడా ఉందని వాటిని అంబులెన్స్​లో అతడికే అప్పగించామని సుశీల్​ మాన్​ తెలిపాడు.

రిషభ్‌ పంత్‌ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ
అయితే క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్​ వేదికగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ.. పంత్​ త్వరగా కోలుకోని ఆరోగ్యంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. మాజీ క్రికెట్​ లెజెండ్​ సచిన్‌ తెందూల్కర్, క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, శిఖర్‌ ధావన్‌ సహా పలువురు ఆటగాళ్లు సైతం సోషల్‌మీడియా వేదికగా పంత్‌ను పరామర్శించి ధైర్యంగా ఉండమని చెప్పారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రార్థిస్తున్నా: ఊర్వశి రౌతేలా
ఇదిలా ఉండగా బాలీవుడ్​ నటి ఊర్వశి రౌతేలా ఈ ఘటనపై డిఫెరంట్​గా స్పందించారు. ఆభరణాలను ధరించి మెరుస్తున్న దుస్తుల్లో ఉన్న ఫొటోను యాడ్​ చేసి ప్రేయింగ్​ అని రాసి ఓ తెల్ల హార్ట్​ సింబల్​తో పాటు ఓ పావురం గుర్తును తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు.

Urvashi Rautela Different Post On Pant Accident
రిషభ్​ పంత్​ ప్రమాదంపై ఉర్వశి రౌతేలా ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​

బీసీసీఐ హెల్త్ బులిటెన్​..
తాజాగా పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ఓ హెల్త్ బులిటెన్​ విడుదల చేసింది. ఇందులో పంత్‌ నుదురు చిట్లి, వీపుపై కాలిన గాయాలున్నాయని, కుడి మోకాలి లిగ్మెంట్‌ పక్కకు జరిగినట్లు ఎక్స్‌రేల్లో తెలిసిందని బోర్డు పేర్కొంది. అయితే ప్రస్తుతం పంత్​ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రమాద సమయంలో కారులో పంత్‌ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడని.. దీంతో వాహనంలో మంటలు చెలరేగినట్లు డీజీపీ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.