ETV Bharat / entertainment

Balakrishna Raviteja Movies : బాలకృష్ణ- రవితేజ.. ఈ టాప్​ స్టార్స్​ బాక్సాఫీస్​ బరిలో ఎన్ని సార్లు పోటీపడ్డారంటే..

author img

By

Published : Aug 1, 2023, 10:56 PM IST

Balakrishna Raviteja Movies
బాలకృష్ణ రవితేజ సినిమా క్లాష్

Balakrishna Raviteja Movies : టాలీవుడ్​ స్టార్ హీరోలు నందమూరి నటసింహం బాలకృష్ణ- మాస్​ మహారాజ రవితేజ.. రానున్న దసరాకు తమ సినిమాలతో బాక్సీఫీస్​ వద్ద తలపడనున్నారు. అయితే వీరిద్దరి సినిమాలు ఇలా క్లాష్ అవ్వడం ఇది తొలిసారి కాదు. మరి వీరు ఇప్పటి వరకు ఎన్ని సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారంటే..

Balakrishna Raviteja Movies : అగ్ర తారల నుంచి యంగ్​ హీరోల వరకు అందరూ తమ సినిమాలతో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు సంపాదించాలని చూస్తుంటారు. ఈ క్రమంలో తమ లుక్స్​ నుంచి నటన వరకు అన్నింటి విషయంలో జాగ్రత్తగా ఉండే ఈ స్టార్స్​.. రిలీజ్​ డేట్​ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పక్క హీరోల సినిమాలతో క్లాష్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటారు.

ఈ క్రమంలో ఆయా దర్శక నిర్మాతలు సైతం విడుదల తేదీల ఖరారు విషయంలో దృష్టి సారిస్తుంటారు. ఇన్ని చేసినప్పటికీ ఏదో ఒక సమయంలో బాక్సాఫీస్​ వద్ద పలువురు స్టార్స్​ పోటీపడ్డ సందర్భాలున్నాయి. అలా నందమూరి నటసింహం బాలకృష్ణ- మాస్​ మహారాజ రవితేజ తమ సినిమాలతో ఒకే సారి థియేటర్లలో దిగి తమ బలాబలాలను పరీక్షించుకున్నారు. రానున్న దసరాకు తమ సినిమాలతో బరిలోకి దిగనున్న ఈ స్టార్​ హీరోలు.. ఇప్పటి వరకు ఎన్ని సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారంటే..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1. పలనాటి బ్రహ్మనాయుడు - ఒక రాజు ఒక రాణి:
నందమూరి నట సింహం బాల‌కృష్ణ లీడ్​ రోల్​లో తెరకెక్కిన యాక్షన్​ మూవీ 'ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు'. ఈ సినిమా 2003 జూన్ 13న విడుద‌లైంది. అయితే ర‌వితేజ హీరోగా వచ్చిన 'ఒక రాజు ఒక రాణి' ఓ వారం గ్యాప్​ తీసుకుని జూన్ 19న విడుద‌లైంది. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను నిరాశప‌రిచాయి.

2. అల్లరి పిడుగు - భగీరథ :
ఇక 2005లో అక్టోబ‌ర్ 5న బాలకృష్ణ నటించిన 'అల్ల‌రి పిడుగు' సినిమా విడుదలైంది. ఇక ఈ సారి కూడా వారం తర్వాతనే ర‌వితేజ న‌టించిన 'భ‌గీర‌థ' విడుదలైంది. ఇక ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్​ అందుకోలేకపోయాయి.

3. ఒక్క మగాడు - కృష్ణ :
బాల‌కృష్ణ కథనాయకుడిగా రుపొందిన 'ఒక్క‌ మ‌గాడు' చిత్రం 2008 జ‌న‌వ‌రి 11న విడుదలైంది. ఇక జనవరి 12న ర‌వితేజ హీరోగా న‌టించిన 'కృష్ణ' సినిమా రిలీజైంది. 'ఒక్క మగాడు' ఆశించిన స్థాయిలో హిట్​ టాక్ అందుకోనప్పటికీ.. 'కృష్ణ' సినిమా బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్లింది.

4. మిత్రుడు- కిక్ :
బాల‌కృష్ణ లీడ్​ రోల్​లో వచ్చిన 'మిత్రుడు' సినిమా 2009 మే 1న విడుదలైంది. ఇక ఈ సినిమా రిలీజైన వారం తర్వాత రవితేజ కిక్​ సినిమా థియేటర్లలో సందడి చేసింది. ఇక 'మిత్రుడు' సినిమా ప్రేక్షకులను నిరశపరచగా.. కిక్​ మాత్రం రవితేజ కెరీర్​ను ఓ మలుపు తీసుకెళ్లి.. తన ఖాతాలో ఓ బ్లాక్​ బస్టర్ హిట్​ వేసింది.

5. పరమ వీర చక్ర - మిరపకాయ్:
2011 సంక్రాంతి బరిలోకి బాల‌కృష్ణ 'ప‌ర‌మ‌వీరచ‌క్ర' వచ్చింది. ఈ సినిమా జ‌న‌వ‌రి 12న రిలీజైంది. ఇక ఆ మ‌రుస‌టి రోజు అంటే జ‌న‌వ‌రి 13న ర‌వితేజ కథనాయకుడిగా న‌టించిన 'మిర‌ప‌కాయ్' థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ రెండు సినిమాల్లో ఒకటి ఆడియెన్స్​ అంచనాలను అందుకోలేకపోగా.. మరొకటి మాత్రం బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

6. దరువు - అధినాయకుడు :
ర‌వితేజ హీరోగా న‌టించిన 'ద‌రువు' మూవీ 2012 మే 25న థియేటర్లలో విడుదలైంది. ఇక ఓ వారం గ్యాప్‌ తీసుకుని జూన్ 1న బాల‌కృష్ణ లీడ్​ రోల్​లో 'అధినాయ‌కుడు' వ‌చ్చింది. అయితే ఇందులోనూ ఓ సినిమా కమర్షియల్​ హిట్​ కాగా.. మరో సినిమా బాక్సాఫీస్ దగ్గ హిట్​ టాక్​ అందుకోలేకపోయింది.
7. శ్రీమన్నారాయణ - దేవుడు చేసిన మనుషులు :
పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో మాస్​ మహారాజా ర‌వితేజ న‌టించిన 'దేవుడు చేసిన మ‌నుషులు' మూవీ 2012 ఆగ‌స్ట్ 15న విడుదలైంది. ఇక రెండు వారాల తర్వాత బాల‌కృష్ణ లీడ్​ రోల్​లో న‌టించిన' శ్రీమ‌న్నారాయ‌ణ' సినిమా విడుదలైంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద ఆశించిన ఫ‌లితాలను రాబట్టలేకపోయాయి.

8. వీరసింహారెడ్డి - వాల్తేరు వీరయ్య :
ఇక ఈ ఏడాది కూడా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్​ వద్ద పోటీ పడ్డారు. జనవరి 11న బాల‌కృష్ణ కథనాయకుడిగా న‌టించిన 'వీరసింహారెడ్డి' సినిమా థియేటర్లలోకి రాగా.. ఆ మ‌రుస‌టి రోజు వ‌చ్చిన మెగాస్టార్​ చిరంజీవి హీరోగా వచ్చిన 'వాల్తేరు వీర‌య్య' రిలీజైంది. అయితే ఈ సినిమాలో ర‌వితేజ ఇందులో ఓ స్పెష‌ల్ రోల్​లో మెరిశారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​ బస్టర్స్​గా నిలిచాయి.
9. భ‌గ‌వంత్ కేస‌రి - టైగ‌ర్ నాగేశ్వ‌రరావు:
ఈ ఏడాది మరోసారి ఈ ఇద్దరూ బాక్సాఫీస్​ వద్ద పోటీపడేందుకు ముందుకొస్తున్నారు. దసరా కానుకగా అక్టోబ‌ర్ 19న బాలకృష్ణ న‌టించిన 'భ‌గ‌వంత్ కేస‌రి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అక్టోబ‌ర్ 20న ర‌వితేజ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' విడుదల కానుంది. అయితే ఇప్పుడు జరగనున్న బాక్సాఫీస్​ వార్‌లో ఎవ‌రు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.