ETV Bharat / entertainment

Raviteja gopichand malineni : నాలుగో సారి మాస్​ కాంబో రిపీట్​.. అఫీషియల్ అనౌన్స్​మెంట్​

author img

By

Published : Jul 9, 2023, 1:18 PM IST

Updated : Jul 9, 2023, 2:23 PM IST

Raviteja gopichand malineni : టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లలో మాస్​ మహారాజా రవితేజ - దర్శకుడు గోపిచంద్‌ మలినేని ఒకటి. వీళ్లిద్దరూ ఇప్పటికే మూడు చిత్రాలు చేసి బాక్సాఫీస్‌ వద్ద సూపర్​ హిట్‌ అందుకున్నారు.

Raviteja gopichand malineni
రవితేజ గోపిచంద్ మలినేని

Raviteja gopichand malineni : టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లలో మాస్​ మహారాజా రవితేజ - దర్శకుడు గోపిచంద్‌ మలినేని ఒకటి. వీళ్లిద్దరూ ఇప్పటికే మూడు చిత్రాలు చేసి బాక్సాఫీస్‌ వద్ద సూపర్​ హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ మేకర్స్‌ ఓ ట్వీట్‌ చేసింది. మోషన్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. మరోసారి బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ క్రియేట్‌ చేసేందుకు నాలుగోసారి హిట్‌ కాంబో రెడీ కానుందని తెలిపింది. ఇకపోతే ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపనున్నారు. . దీని బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్​లో ఇంట్రెస్టింగ్​గా సాగే కథతో దీన్ని రూపొందించనున్నారని తెలిసింది.

గతేడాది 'ధమాకా' చిత్రంతో సూపర్​ హిట్ అందుకున్న మాస్ మహారాజ.. రవితేజకు ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో రో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన 'రావణాసుర' బాక్సాఫీస్​ వద్ద నిరాశను ఇచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్​తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్​ను ఆకట్టుకోలేకపోయింది. కానీ రవితేజ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

Raviteja Tiger Nageswar rao movie : ప్రస్తుతం రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు' చిత్రంలో నటిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. స్టూవర్టుపురంలోని గజదొంగ బయోపిక్​ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1970ల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. రవితేజకు ఇదే ఫస్ట్ పాన్​ ఇండియా సినిమా కావడం విశేషం. నటి రేణూ దేశాయ్‌ దాదాపు 18ఏళ్ల తర్వాత ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తోంది. హేమలతా లవణం అనే పాత్రలో రవితేజకు అక్కగా కనిపిస్తారని సమాచారం అందింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అక్టోబర్‌20న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఇది పూర్తవ్వగానే.,. గోపిచంద్‌ మలినేని సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది. అలానే మరో చిత్రం కూడా మాస్ మహారాజా చేయనున్నారు. 'ఈగల్​' అనే యాక్షన్ థ్రిల్లర్​లో నటించనున్నారు.

ఇదీ చూడండి :

రవితేజ మల్టీ స్టారర్​లో విశ్వక్ సేన్​.. విలన్​గా మంచు మనోజ్​?

పులుల్ని వేటాడే పులి.. ఆసక్తిగా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్‌ లుక్‌

Last Updated :Jul 9, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.