ETV Bharat / entertainment

Balakrishna record : బాలయ్య.. మజాకా.. అదీ నటసింహం రేంజ్​.. ఏ హీరోకు సాధ్యం కాని మైండ్ బ్లాక్​ రికార్డ్

author img

By

Published : Jul 30, 2023, 1:11 PM IST

Updated : Jul 30, 2023, 5:17 PM IST

Bala Krishna 200 Days Movies : నందమూరి నటసింహం బాలకృష్ణ 'వీరిసింహారెడ్డి' విడుదలై రెండు వందల రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాలయ్య ఓ అరుదైన రికార్డును అందుకున్నారు. ఆ వివరాలు..

Balakrishna Veera SimhaReddy
బాలకృష్ణ వీరసింహా రెడ్డి

Bala Krishna 200 Days Movies : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసిన మూవీ 'వీరసింహారెడ్డి'. నందమూరి నట సింహం బాలకృష్ణ లీడ్​ రోల్​లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్​ ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్​ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. బాలయ్య డ్యూయెల్​ రోల్​లో మెరిసిన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ అందుకుని కాసుల వర్షాన్ని కురిపించింది.

అయితే ఈ సినిమా తాజాగా ఓ అరుదైన రికార్డును అందుకుంది. సుమారు 200 రోజుల పాటు ఒక్క థియేటర్​లో నిర్విరామంగా రోజుకు నాలుగు షోల పాటు ఆడుతూ.. ఇండస్ట్రీలో ఓ నయా రికార్డును తిరగరాసింది. జ‌న‌వ‌రి 12న వరల్డ్​ వైడ్​ రిలీజ్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 21 నాటికి 100 రోజుల‌ మార్క్​ను దాటగా.. ఈ శ‌క్ర‌వారంతో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్‌ జిల్లాలోని అలూరిలో ఎస్ఎల్ఎన్ఎస్ థియేట‌ర్‌లో ఈ 200 రోజుల మైలురాయిని అందుకుంది.

Balakrishna Movies : అయితే నట సింహం బాలకృష్ణకు ఇలాంటి ఘననతు సొంతం చేసుకోవడం కొత్తమీ కాదు. ఆయన నటించిన పలు సినిమాలు ఈ రికార్డును ఎప్పుడో నమోదు చేశాయి. అలా ఒకటి కాదు రెండు కాదు 'వీరసింహారెడ్డి'తో కలిపి ఈ లిస్ట్​లో ఆరు సినిమాలు ఉన్నాయి. అందులో 'మంగమ్మ గారి మనవడు', 'లెజెండ్'​,'సింహా', 'నరసింహ నాయుడు', 'సమర సింహారెడ్డి'లు సుమారు 200 రోజుల పాటు ఆడి బాక్సాఫీస్​ను షేక్​​ చేశాయి. ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాలు ఇలా 200 రోజుల పాటు ఒకే థియేటర్​లో ఆడటం ఓ అరుదైన రికార్డ్​. ఈ అరుదైన ఫీట్​ను అందుకున్న ఏకైక హీరో బాలయ్యనే కావడం విశేషం. ఒకే థియేటర్​లో కాకుండా షిష్టుల వారిగా కూడా బాలకృష్ణ సినిమాలు నిర్విరామంగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. 'ముద్దులకృష్ణయ్య' 'ముద్దులమావయ్య' 'అనసూయమ్మ గారి అల్లుడు', 'మువ్వ గోపాలుడు' లాంటి సినిమాలు ఈ లిస్ట్​లో ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhagwant Kesari Movie : ఇక బాలయ్య ప్రస్తుతం అనిల్​ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భగవంత్​ కేసరి' సినిమాలో నటిస్తున్నారు. భారీ యాక్షన్​తో తెరకెక్కుతున్న ఈ మూవీలో​ బాలకృష్ణ డిఫరెంట్​ షేడ్స్​ ఉన్న రోల్​లో నటిస్తున్నారు. ఇక ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వీరిద్దరి కలయికలో తొలి సినిమా ఇది. యంగ్​ అండ్​ బ్యూటీ హీరోయిన్​ శ్రీలీలతో పాటు, తమిళ స్టార్​ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్​ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Jul 30, 2023, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.