ETV Bharat / entertainment

'గాడ్​ఫాదర్' డబుల్​ కాదు​ ట్రిపుల్ బొనాంజా.. 'కేజీఎఫ్ 2'లో 'సలార్​' గ్లింప్స్!

author img

By

Published : Apr 8, 2022, 10:00 AM IST

Updated : Apr 8, 2022, 10:18 AM IST

kgf 2 salaar teaser
కేజీఎఫ్​ 2 సలార్​

మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న 'గాడ్​ఫాదర్'​లో బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్​ కూడా నటించనున్నారని తెలిసింది. ఇక 'సలార్​' అప్డేట్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్​ ఫ్యాన్స్​ను ఉత్సాహపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్ర​ టీజర్​ను 'కేజీఎఫ్​ 2' సినిమాకు జత చేస్తారని ప్రచారం సాగుతోంది.

Purijagannadh Chiru Godfater movie: మెగాస్టార్​ చిరంజీవి సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్​ నటించబోతున్నారని ఇటీవలే హీరో విజయ్​ దేవరకొండ తెలిపారు. అప్పుడీ విషయం బాగా ట్రెండ్​ అయింది. అయితే అది ఏ చిత్రం అనేది చెప్పలేదు. దీంతో అందరూ బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్​లో పూరి కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మూవీ కాదని.. పూరి కనిపించేది 'గాడ్​ఫాదర్'​ అని మళ్లీ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారని మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు కూడా ఈ చిత్ర కథ విషయంలో పూరి హస్తం కూడా ఉందని ప్రచారం సాగింది. ఇంతకీ పూరి ఏ మూవీలో నటిస్తున్నారో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇక 'గాడ్​ఫాదర్'​ విషయానికొస్తే.. మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్​గా ఇది రూపొందుతోంది. మాతృకలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రను తెలుగులో బాలీవుడ్​ సూపర్​ స్టార్​ సల్మాన్‌ ఖాన్​ చేస్తుండటం విశేషం. లేడీ సూపర్​స్టార్ నయనతార హీరోయిన్​. సత్యదేవ్, సునీల్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Salaar teaser in KGF 2 movie: పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న పవర్‌ప్యాక్డ్​ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా 'సలార్‌'. సెన్సేషనల్ డైరెక్టర్​ ప్రశాంత్ నీల్​ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్​ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్​ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్​ను ఉత్సాహపరిచే వార్త ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అవుతోంది. ఈ సినిమా టీజర్​ను రిలీజ్ చేయాలని మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారని టాక్. దీన్ని 'కేజీఎఫ్ 2'తో జ‌త చేయాలని భావిస్తున్నారట. చిత్ర ఇంటర్వెల్​లో దీన్ని ప్రసారం చేస్తారని తెలిసింది. ఇలా చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో కేజీఎఫ్​ బుకింగ్స్ జ‌రుగుతాయని మేక‌ర్స్ భావిస్తున్నార‌ని సమాచారం. ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే ఏప్రిల్ 14వ‌ర‌కు ఆగాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: పవన్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. కానీ అక్కినేని అభిమానులకు మాత్రం..

Last Updated :Apr 8, 2022, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.