ETV Bharat / entertainment

పవన్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. కానీ అక్కినేని అభిమానులకు మాత్రం..

author img

By

Published : Apr 8, 2022, 9:11 AM IST

పవన్​కల్యాణ్​-హరీశ్​ శంకర్ కాంబోలో రానున్న సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్​ వచ్చింది. కాగా, అక్కినేని అభిమానులకు 'ఏజెంట్'​ సినిమా నిర్మాత అనిల్ సుంకర క్షమాపణలు చెప్పారు. ఈ వివరాలను తెలుసుకుందాం..

akhil birthday
అఖిల్​ పవన్​కల్యాణ్​

Pawankalyan Harish Shankar movie: పవర్​స్టార్​ పవన్​కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'భవదీయుడు భగత్​సింగ్'​ ఒకటి. ఈ మూవీకి హరీశ్​శంకర్​ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ విజయాన్ని అందుకున్న 'గబ్బర్​సింగ్' తర్వాత వీరి కాంబినేషన్​లో రానున్న చిత్రమిది. దీంతో దీనిపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై చిత్రంపై భారీ ఆసక్తిని నెలకొల్పింది. త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుందీ సినిమా. ​అయితే తాజాగా అభిమానులకు ఓ సూపర్​ అప్డేట్​ను ఇచ్చింది చిత్రబృందం. త్వరలోనే ఓ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పాటు.. పవన్​ కల్యాణ్​తో కలిసి దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే మూవీ షూటింగ్​ ప్రారంభంకానుందని అంతా అనుకుంటున్నారు. హరీశ్​ శంకర్, పవన్​ కాంబోలో ఈసారి బాక్స్​ఫీస్ బద్దలవ్వడం ఖాయమని ట్వీట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎంటర్​టైనర్​గానే కాకుండా సందేశాత్మకంగా ఉండబోతుందని చిత్రయూనిట్​ గతంలోనే ప్రకటించింది. దీనికి దేవీ శ్రీ ప్రసాద్​ సంగీతమందిస్తుండగా.. పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనుందని సమాచారం.

  • Every time…
    Every meet ,
    Every conversation gives an adrenaline rush …. All set … can’t wait for take off… pic.twitter.com/Qzw7yJenLT

    — Harish Shankar .S (@harish2you) April 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అక్కినేని అభిమానులకు సారీ చెప్పిన నిర్మాత.. సాధారణంగా హీరో పుట్టినరోజు అంటే... ఆయన నటిస్తున్న సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్​ రావడం సహజం. అలానే నేడు(శుక్రవారం) అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా 'ఏజెంట్' నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆయన అభిమానులు ఎదురు చూశారు. టీజర్​ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా యూనిట్ వారిని నిరుత్సాహపరిచింది. ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోతున్నామని తెలిపింది. "పుట్టిన రోజున 'ఏజెంట్' టీజర్ విడుదల చేయలేక పోతున్నందుకు అక్కినేని ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు. మేం బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగా ఉంటుంది. మేలో అత్యంత క్వాలిటీ ఉన్న థియేట్రికల్ టీజర్ విడుదల చేస్తాం" అని ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. మరో ట్వీట్​లో అఖిల్ అక్కినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. వక్కంతం వంశీ కథ అందించగా తమన్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ రెడ్డికి చెందిన స‌రెండ‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామబ్రహ్మం సుంకర మూవీని నిర్మిస్తున్నారు.

Akhil birthday
అఖిల్​ అభిమానులకు సారీ చెప్పిన నిర్మాత అనిల్ సుంకర

ఇదీ చూడండి: బయోపిక్‌ల జాతరకు క్లైమాక్స్‌ ఎప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.