ETV Bharat / entertainment

Hyper Aadi Marriage : ఆ యాంకర్​తో ప్రేమలో హైపర్ ఆది! త్వరలో వివాహ బంధంలోకి స్టార్​ కమెడియన్!

author img

By

Published : Jul 29, 2023, 10:20 PM IST

Hyper Aadi Marriage : బుల్లితెర హాస్యనటుడు హైపర్ ఆది ప్రస్తుతం వెండితెరపై కూడా దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే ఆది కామెడీ టైమింగ్​కు సపరేట్ ఫ్యాన్​బేస్​ ఉంది. అయితే ఆది త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారట. మరి అమ్మాయి ఎవరంటే..

Hyper Aadi Marriage
హైపర్ ఆది పెళ్లి

Hyper Aadi Marriage : బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడట. తనకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్న ఓ యూట్యూబ్​ యాంకర్​​తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలె వీరి ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పగానే.. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో హైపర్ ఆదికి త్వరలోనే ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరగనుందని టాక్ వినిపిస్తోంది. కానీ తన ప్రేమ గురించి కానీ, పెళ్లి గురించి కానీ ఆది ఎక్కడ కూడా అధికారికంగా వెల్లడించలేదు.

బుల్లితెరపై టాప్ కమెడియన్​లలో ఒకరిగా పేరొందారు హైపర్ ఆది. తనదైన శైలిలో ఆది వేసే పంచులకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఆది కామెడీ టైమింగ్​కు సపరేట్ ఫ్యాన్​ బేస్​ ఉంది. కాగా కొంతకాలం నుంచి ఆది.. సినిమాల్లో కూడా కమెడియన్ పాత్రలో నటిస్తూ.. ఆడియెన్స్​ను మెప్పిస్తున్నాడు. ఇలా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా.. రచయితగా కూడా రాణిస్తున్నారట. రీసెంట్​గా వచ్చిన ధనుష్ సార్ సినిమాకు.. ఆది మాటలు, డైలాగులు అందించారని టాక్.

కెరీర్ ప్రారంభం ఇలా...
Hyper Aadi Jabardasth : ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆది. మొదట్లో అదిరే అభి టీమ్​లో ఓ కంటెస్టెంట్​గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత రైజింగ్ రాజు టీమ్​లో చేరారు. ఇక తన సొంత టాలెంట్​తో ఆడియెన్స్​కు మరింత దగ్గరై.. అదే జబర్దస్త్ షో లో టీమ్​ లీడర్​గా ఎదిగి 'హైపర్ ఆది' గా మారారు. అప్పటినుంచి కెరీర్​లో దూసుకుపోతున్న ఆది.. ఢీ డ్యాన్స్ ప్రోగ్రామ్​, శ్రీదేవి డ్రామా కంపెనీ షో తో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.

పొలిటికల్ ఎంట్రీ..
టాలీవుడ్​లో పవన్ కల్యాణ్​ అంటే తనకు ఎంతో అభిమానం అని.. ఆది పలుమార్లు చెప్పారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి బహిరంగంగానే ఎన్నో సార్లు పలు వేదికలపై మద్దతుగా కూడా మాట్లాడారు. అంతేకాకుండా పవన్ ఓ మంచి వ్యక్తి అని, ఆయనకు డబ్బుపైన ఎలాంటి ఆసక్తి లేదని ఆది ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా పవన్ కల్యాణ్ - డైరెక్టర్​ క్రిష్ కాంబినేషన్​లో రానున్న 'హరిహర వీరమల్లు' సినిమా కోసం పనిచేస్తున్నట్లు హైపర్ ఆది గతంలో తెలిపారు. కాగా జనసేన అధికారిక ప్రోగ్రామ్​లు, సభల్లో ఆది పాల్గొంటున్నారు. అయితే 2024లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల్లో హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీచేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.