ETV Bharat / entertainment

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : ఈ డైలాగ్స్​ విన్నారా ? మీకు ఏది నచ్చింది?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 2:32 PM IST

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : దసరా కానుకగా టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలా ఈ సారి ఆడియెన్స్​ను అలరించేందుకు 'భగవంత్​ కేసరి', 'టైగర్​ నాగేశ్వర్​రావు' థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో కొన్ని ఫేమస్​ డైలాగ్స్ చూద్దామా..

Bhagavanth Kesari Movie Dialogues
Bhagavanth Kesari Movie Dialogues

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : సినిమాలు అంటే సాంగ్స్​, యాక్షన్​ సీన్స్​తో పాటు పవర్​ఫుల్​ డైలాగ్స్​కు పెట్టింది పేరు. ఇక నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్​ ఆన్ యాక్షన్​ సీన్స్​ + ఎమోషనల్​ డైలాగ్స్​.. ఇది బాలయ్య మార్క్​ సినిమాలు. చిన్న పిల్లాడి నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరి నోట్లో అవి నానుతూనే ఉంటాయి. డోన్ట్​ ట్రబుల్​ ద ట్రబుల్​.. ఫ్లూట్ జింక ముండు ఊదు సింహం ముందు కాదు, దబిడి దిబిడి లాంటి డైలాగ్స్​ అయితే మనం ఇప్పటికీ రోజూ వింటుంటాం. అవి ఎంత పాపులర్ అంటే కొన్ని సినిమాల్లో వాటిని విరివిగా వాడిన సందర్భాలున్నాయి. 'వీరసింహారెడ్డి'తో సూపర్ హిట్​ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు 'భగవంత్​ కేసరి'గా మన ముందుకు రానున్నారు. అయితే ఈ సినిమాలో తొలిసారిగా ఆయన తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పారు. తాజాగా విడుదలైన ట్రైలర్​ ద్వారా అవి సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్​ అయ్యాయి. అవేంటో మీరు కూడా ఓ సారి చూసేయండి..

  1. నువ్​ ఏడనున్నా ఇట్లా దమ్ముతో నిలబడాలి అప్పుడే దునియా నీకు బాంచన్ అంటది.
  2. ఆర్మీ ఈజ్​ నాట్​ ఏ ఆక్యుపేషన్​.. ఇట్ ఈజ్​ ఎన్ ఇన్​స్పిరేషన్​
  3. బిడ్డనైతే విడిసిపెట్ట బతిమిలాడుతా.. బుజ్జగిస్తా, అవసరం అయితే కాళ్లు పట్టుంకుంటా రా భాయ్ ! బిడ్డని స్ట్రాంగ్ చెయ్యాలి. షేర్ లెక్క.
  4. లేసిన నోరు ఏమందో తేలియాలి, మిమల్ని పంపిన కొడుకెవడో తెలియాలి.
  5. ఎవడు బలవంతుడో వాడే గెలుస్తాడు, నను కొట్టే బలవంతుణ్ణి ఆ భగవంతుడు కూడా తేలేడు.
  6. దేవుడు ఎవర్రా ? దేవుడు ఎవరు ? బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే దేవుడు లెక్క!
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Tiger Nageswara Rao Dialogues : ఇక 'భగవంత్​ కేసరి' విడుదలైన మరుసటి రోజు( అక్టోబర్ 20)న థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజ 'టైగర్​ నాగేశ్వరరావు' ముందుకొస్తోంది. పాన్ ఇండియా లెవెల్​లో రానున్న ఈ సినిమాలో కూడా కొన్ని పవర్​ఫుల్​ డైలాగ్స్​ ఉన్నాయి. అవేంటంటే?

  1. దొంగతనానికి కొన్ని సార్లు ధైర్యం ఒక్కటే చాలదు. తెలివితేటలు కూడా కావాలి
  2. కొట్టే ముందు.. కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు
  3. రేపటి నుంచి స్టువర్ట్​పురంలో దేవుడి పాట నాదే.. చెప్పాడికి
  4. స్టువర్ట్​పురం నాగేశ్వర రావు కథ అక్కడే ఆగిపోయింది. కానీ టైగర్​ నాగేశ్వర​రావు కథ అక్కడే మొదలైంది.

Bhagvant Kesari Kajal Agarwal : బాలయ్యపై కాజల్​ అగర్వాల్​ కామెంట్స్​.. అలాంటివి లెక్కచేయదట​!

Bhagavanth kesari World wide business : 'భగవంత్​ కేసరి' మేనియా షురూ.. రెండు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్​ బిజినెస్ ఎంత జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.