ETV Bharat / entertainment

Anushka Shetty New Movie : పాన్​ ఇండియా లెవెల్​లో అనుష్క మూవీ.. 14 భాషల్లో రిలీజ్​.. హీరో ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 11:02 AM IST

Updated : Sep 1, 2023, 12:29 PM IST

Anushka Shetty New Movie :ఇప్పటి వరకు తెలుగు, తమిళంలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్​ బ్యూటీ అనుష్క ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదల చేశారు. ఆ విశేషాలు మీ కోసం..

Anushka Shetty Malayalam Movie
అనుష్క మలయాళం సినిమా

Anushka Shetty New Movie : తన వర్సటాలిటీతో ప్రేక్షకులను కట్టిపడేసే టాలీవుడ్​ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం మరో పాన్‌ ఇండియా సినిమాలో నటించనున్నారు. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే నటించిన ఈ స్టార్​ హీరోయిన్​ ఇప్పుడు మాలీవుడ్​లోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదల చేశారు.

'కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ ఓ హారర్‌ సినిమాకు అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో మలయాళ స్టార్​ జయసూర్య లీడ్​ రోల్​​లో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ తాాజా గ్లింప్స్‌ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్​ అవుతోంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ కథ రూపొందనున్నట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు అనుష్క. 'అరుంధతి', 'రుద్రమదేవి', 'బాహుబలి'లో దేవసేన లాంటి పాత్రలతో మెప్పించిన ఆమె.. ఈ సినిమాలోనూ అరుంధతి తరహాలోని పాత్రనే చేయనున్నారట. ప్రముఖ దర్శకుడు రోజిన్ థామస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్​ కానుంది. మొదటి భాగం 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా మొత్తం 14 భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.

Anushka Shetty Upcoming Movies : ఇక అనుష్క.. 'బాహుబలి' సినిమా తర్వాత 'నిశ్శబ్దం' అనే సస్పెన్స్​ థ్రిల్లర్​తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత ఎటువంటి అప్డేట్స్​ ఇవ్వని స్వీటీ.. దాదాపు మూడేళ్ల తర్వాత 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' సినిమాతో ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యారు. నవీన్​ పోలిశెట్టి లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా యూవీ బ్యానర్స్​పై రూపొందుతోంది.

Miss Shetty Mr Polishetty Release Date : ఇక మహేశ్‌బాబు.పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. క నవీన్​ ఇందులో స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలో కనిపిస్తుండగా.. అనుష్క ఓ చెఫ్‌గా నటించారు. ప్రస్తుతం మూవీ యూనిట్​ మొత్తం ప్రమోషన్స్​లో బిజీగా ఉంది.

Last Updated : Sep 1, 2023, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.