ETV Bharat / crime

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Jun 5, 2022, 10:22 AM IST

Jubilee hills gang rape case
Jubilee hills gang rape case

Jubilee hills gang rape case:రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లిహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో మైనర్‌ నిందితుణ్ని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Jubilee hills gang rape case: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి ఉమర్‌ఖాన్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు... ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరో మైనర్‌ నిందితుణ్ని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..

Gang Rape on Girl: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. ఐదుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్టు భావిస్తోన్న పోలీసులు ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు మైనర్ కావడం వల్లే శనివారం ఉదయం అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.ఈ కేసులో నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మిగతా నిందితుల వేటలో ఉన్నారు. నిందితులు గోవావైపు వెళ్లినట్టు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్‌ నుంచి బాలిక బయటకు వచ్చింది.

అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8మంది యువకులు బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ప్రముుఖుల కుమారులు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక.. వారితో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.

ఆ తర్వాత బాలిక ఫోన్‌ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. ఐదుగురు కారులో తనపై దాడికి పాల్పడ్డారని చెప్పడంతో ఆమె తండ్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తొలుత భావించిన పోలీసులు.. అత్యాచారం చేసినట్లు బాలిక చెప్పడంతో సెక్షన్లు మార్చి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.