ETV Bharat / crime

టిప్పర్​, కారు ఢీ.. ముగ్గురు మృతి

author img

By

Published : Mar 10, 2021, 7:38 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం చౌళతండా సమీపంలో ప్రమాదవశాత్తు టిప్పర్​ లారీ కారును ఢీ కొట్టింది. ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరు మరణించారు.

tipper-lorry-car-collision-two-people-died-at-chola-tanda
టిప్పర్ లారీ​, కారు ఢీ.. ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్​ లారీ ఎదురుగా వచ్చిన కారును ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఇద్దరు క్షతగాత్రులను ఆస్రత్రికి తరలించగా వారిలో మరొకరు మత్యువాత చెందారు.

మంగనూర్​కు చెందిన నలుగురు వ్యక్తులు మారుతీ కారులో భూత్పూర్‌ వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. మంగనూరుకు చెందిన సత్యనారాయణ గౌడ్(35), వెంకటయ్య గౌడ్(47) అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : భర్తను హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.