ETV Bharat / crime

తెలిసిన వారే బరితెగిస్తున్నారు.. అమ్మాయిలూ.. పారాహుషార్​..!

author img

By

Published : Jun 5, 2022, 8:11 AM IST

RAPE CASES: జూబ్లీహిల్స్​లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. స్నేహం, పరిచయం పేరుతో నమ్మిన యువతులపై కొందరు లైంగిక దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లలో 2020లో 904 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2021 నాటికి 1,061కి చేరుకున్నాయి. ఈ ఏడాది 5 నెలల వ్యవధిలోనే వందల సంఖ్యలో జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

తెలిసిన వారే బరితెగిస్తున్నారు.. అమ్మాయిలూ.. పారాహుషార్​..!
తెలిసిన వారే బరితెగిస్తున్నారు.. అమ్మాయిలూ.. పారాహుషార్​..!

తెలిసిన వారే బరితెగిస్తున్నారు.. అమ్మాయిలూ.. పారాహుషార్​..!

RAPE CASES: మైనర్లు, యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. వావివరుసలు లేకుండా కొందరు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌ నగర శివారులో సొంత అన్న సోదరిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. గతేడాది ఎల్బీనగర్‌ పరిధిలోని బస్తీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అనంతరం నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచన్‌బాగ్‌లో మారు తండ్రి నిర్వాకానికి 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. అత్యాచార బాధితుల్లో అధిక శాతం తెలిసినవారి చేతుల్లోనే బలవుతున్నారని పోలీసులు చెబుతున్నారు. స్నేహంగా మెలగడం, చనువుగా ఉండటాన్ని అవకాశం చేసుకుంటున్న కొందరు ప్రబుద్ధులు.. వారి నిస్సహాయతను అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఉపాధి కోసం వెళ్లి.. వలలో చిక్కి..: పేదరికం, నిరక్షరాస్యత ఉపాధి అవకాశాల కోసం ఇంటి గడపదాటిన అమ్మాయిలు.. దళారుల వలలో చిక్కి అంగటి బొమ్మలుగా మారుతున్నారు. రాచకొండ పోలీసులు 2020, 2021లో సుమారు 700 మందిని వ్యభిచార కూపం నుంచి కాపాడారు. ఇందులో 50 నుంచి 60 మంది వరకు మైనర్లే ఉన్నారు. ప్రస్తుతం నగరంలో వ్యభిచార కార్యకలాపాలు, రేవ్‌ పార్టీలు, అశ్లీల నృత్యాలు చేస్తూ పట్టుబడుతున్న యువతుల్లో.. యూపీ, దిల్లీ, హరియాణా, చంఢీగఢ్‌, అసోం, ఝార్ఖండ్‌, త్రిపుర, ఒడిశా, ఏపీ వంటి రాష్ట్రాల వారు ఉంటున్నారు. మరోవైపు ఉజ్బెకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఉగాండా, రష్యాకు చెందిన వారూ పట్టుబడుతున్నారు.

బాలికలు, యువతులు పారాహుషార్​..: అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో బాలికలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరిపైన అనుమానం వచ్చినా డయిల్‌ 100కు తక్షణం సమాచారం అందించాలని చెబుతున్నారు. దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి..

కుమార్తె బాధను పసిగట్టిన తల్లి.. సామూహిక​ అత్యాచారం ఇలా వెలుగులోకి..!

వినోదం మాటున విశృంఖలత్వం... పట్టించుకోని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.