ETV Bharat / crime

నీరజ్​ హత్య కేసు ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్ట్​

author img

By

Published : May 23, 2022, 12:45 PM IST

Updated : May 23, 2022, 1:36 PM IST

Begumbazar Honor killing case: బేగంబజార్ హత్య కేసు ఘటనలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు అభినందన్​తో పాటు మరో నిందితుడు మహేశ్​ను అదుపులోకి తీసుకున్నారు.

నీరజ్​ హత్య కేసులో పోలీసుల అదుపులో మరో నిందితుడు
నీరజ్​ హత్య కేసులో పోలీసుల అదుపులో మరో నిందితుడు

Begumbazar Honor killing case: హైదరాబాద్ బేగంబజార్​ నీరజ్ పన్వార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అభినందన్​ను పోలీసులు మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు పరారీలో ఉన్న మరో నిందితుడు మహేశ్​నూ పట్టుకున్నారు. హత్య తర్వాత మహేశ్​ పుణె పారిపోగా.. షాహినాజ్ ​గంజ్ పోలీసులు అతడిని హైదరాబాద్​కు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్​కు తరలించారు. ముగ్గురు నిందితులు విజయ్, సంజయ్, రోహిత్​లను చంచల్​గూడ జైలుకు తరలించారు. మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తీసుకెళ్లారు.

అసలేం జరిగిందంటే..: అఫ్జల్‌గంజ్‌ పరిధిలోని కోల్సావాడిలో నివాసముండే నీరజ్ పన్వార్​ బేగంబజార్‌లో తండ్రి రాజేందర్​నాథ్‌తో కలిసి వేరుశనగ గింజల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. అదే ప్రాంతంలో నివాసం ఉండే సంజనతో నీరజ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గతేడాది పాతబస్తీలోని గణేశ్‌టెంపుల్‌లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారం తెలియకపోవడం.. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవటంతో యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి ప్రాణభయం ఉందంటూ నవదంపతులు అఫ్జల్‌గంజ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మేజర్లు కావటంతో పోలీసులు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపగా 'నీరజ్‌-సంజన' కలిసి జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం వారికి బాబు జన్మించాడు. అప్పటికే నీరజ్‌పై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఎలాగైనా హతమార్చాలని పథకం వేశారు.

దారుణంగా హత్య..: కొన్ని రోజులుగా నీరజ్‌ కదలికలపై నిఘా పెట్టిన దుండగులు.. రెక్కీ నిర్వహించారు. నిన్న రాత్రి తన తాతయ్యతో కలిసి నీరజ్‌ బయటికి వెళ్లి వస్తుండగా వెంబడించి ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు. అతడి తల, మెడపై పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల వద్ద కత్తులు చూసి భయాందోళనకు గురైన స్థానికులు వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయాక రక్తపుమడుగులో పడి ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా... అప్పటికే నీరజ్‌ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత కథనాలు..

'సంజన సమీప బంధువులే నీరజ్​ను హత్య చేశారు'

నా సోదరులే నీరజ్​ను హత్య చేశారు..: రెండు నెలల బాబుతో సంజన ధర్నా

బేగంబజార్ హత్య కేసులో నలుగురికి రిమాండ్.. మరో ఇద్దరి కోసం గాలింపు

Last Updated : May 23, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.