ETV Bharat / crime

డ్రగ్స్​ ప్రధాన సూత్రధారి ఎడ్విన్​ పరారీ.. గాలిస్తున్న నార్కోటిక్​ పోలీసులు

author img

By

Published : Sep 26, 2022, 3:02 PM IST

Mastermind of the drugs Edwin is on the run: రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో డ్రగ్స్​ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రధాన సూత్రధారి ఎడ్విన్​ పరారీలో ఉన్నట్లు హైదరాబాద్​ నార్కోటిక్​ పోలీసులు తెలిపారు. ఇతని గురించి నార్కోటిక్​ పోలీసులు గాలిస్తున్నారు. ఎడ్విన్​ను పట్టుకుంటే మాదక ద్రవ్యాలకు సంబంధించిన డొంక మొత్తం కదులుతుందని పోలీసులు చెప్పుతున్నారు.

drugs case
డ్రగ్స్​ కేసు

Mastermind of the drugs Edwin is on the run: గోవా మాదక ద్రవ్యాల కేసులో పరారీలో ఉన్న ఎడ్విన్ కోసం హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు గాలిస్తున్నారు. గోవా నుంచి తప్పించుకున్న ఎడ్విన్ బెంగళూరు లేదా ముంబయిలో తలదాచుకొని ఉండొచ్చని నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. మాదక ద్రవ్యాల కేసులో ఎడ్విన్ నిందితుడిగా ఉన్నాడు. రెండు నెలల క్రితం గోవా పోలీసులు ఎడ్విన్​ను ఓ కేసులో అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు గోవా జైల్లో ఉన్న ఎడ్విన్ ఆ తర్వాత బెయిల్​పై బయటికి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్​లోనూ ఎడ్విన్​పై మాదక ద్రవ్యాల కేసు ఉండటంతో నార్కోటిక్ పోలీసులు, ఈ విషయాన్ని గోవా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎడ్విన్​ను అప్పజెప్పాలని కోరగా ఆ మేరకు గోవా పోలీసులు ఎడ్విన్​కు నోటీసులు జారీ చేశారు.

కరోనా వచ్చి అనారోగ్యం బారిన పడ్డానని పోలీస్ స్టేషన్​కు రాలేనని ఎడ్విన్ గోవా పోలీసులకు సమాధానం ఇచ్చాడు. ఈ మేరకు కరోనా సోకినట్లు ఓ ధ్రువీకరణ పత్రాన్ని పోలీసులకు పంపించాడు. ఆ కరోనా రిపోర్ట్​ను నార్కోటిక్ పోలీసులకు పంపించారు. అనుమానం వచ్చిన నార్కోటిక్ పోలీసులు ఎడ్విన్ కరోనా రిపోర్టును పరిశీలించారు. అది నకిలీ కరోనా రిపోర్టుగా తేల్చి, ఇదే విషయాన్ని గోవా పోలీసులకు చెప్పారు. ఈ విషయంపై గోవా పోలీసులు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఎడ్విన్ గోవా నుంచి పరారయ్యాడు. గతంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండాలని అతను రెండుసార్లు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా అది తిరస్కరించబడింది. అతడు ఎక్కడున్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు నార్కోటిక్ పోలీసులు, సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. గోవాలో మాదక ద్రవ్యాలు సరఫరా చేయడంతో కీలక సూత్రధారిగా ఉన్న ఇతనిని అరెస్ట్ చేస్తే మరింత సమాచారం వస్తుందని నార్కోటిక్ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే బోర్కర్, డిసౌజాను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. డిసౌజాను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్కోటిక్ పోలీసులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.