ETV Bharat / crime

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచి.. తాను పొడుచుకున్న ప్రియుడు

author img

By

Published : Dec 13, 2022, 12:47 PM IST

Updated : Dec 13, 2022, 2:57 PM IST

attack
attack

12:44 December 13

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచి.. తాను పొడుచుకున్న ప్రియుడు

Boy friend attack with knife on Girl friend family: హైదరాబాద్‌ మియాపూర్ ఆదిత్యనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు, ఆమె తల్లిని... ప్రియుడు కత్తితో పొడిచి.. గొంతుకోసుకున్నాడు. ప్రియురాలు, ఆమె తల్లికి తీవ్రగాయాలు కావడంతో... ఇద్దరినీ కొండాపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సందీప్‌కు సైతం తీవ్రగాయాలు కావడంతో... గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వివరాలు మీడియాకు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన 19ఏళ్ల వైభవి, నిందితుడు సందీప్‌ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. నిశ్చితార్థం కూడా జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల నుంచి సందీప్‌ను వైభవి దూరంగా పెడుతూ వస్తోంది. పెద్దల సమక్షంలో విడిపోయారు. అప్పటి నుంచి సందీప్‌ వేరు వేరు ఫోన్ల నుంచి తనను(వైభవి) చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మెసేజ్‌ పంపుతుండేవాడని పేర్కొన్నారు. అతని వేధింపులు భరించలేని వారు కొద్ది నెలల క్రితం హైదరాబాద్​లోని హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో సోదరుడి దగ్గర నివాసముంటున్నారని డీసీపీ తెలిపారు.

వైభవికి మరొకరితో వివాహం జరుగుతుందని తెలుసుకున్న సందీప్ ఇవాళ హైదరాబాద్ వచ్చాడని డీసీపీ వెల్లడించారు. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో బాధితులు ఉంటున్న ఇంటికి వెళ్లిన సందీప్‌ వైభవి, ఆమె తల్లి శోభతో గొడవ పెట్టుకుని.. వారిపై కత్తితో దాడి చేశాడని డీసీపీ తెలిపారు. అనంతరం నిందితుడు కూడా గొంతు కోసుకున్నాడని చెప్పారు. బాధితుడు సందీప్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించామని అతని పరిస్థితి విషమంగా ఉందని డీసీపీ వివరించారు. కొండాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైభవి, ఆమె తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు డీసీపీ శిల్పవల్లి చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 13, 2022, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.