ETV Bharat / crime

YOUNG WOMAN SUICIDE: మార్కులు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

author img

By

Published : Oct 26, 2021, 5:12 AM IST

పీజీ ఎంట్రన్స్​లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ యువతి బలవనర్మణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జరిగింది.

YOUNG WOMAN SUICIDE
మార్కులు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో విషాదం చోటు చేసుకుంది. పీజీ ప్రవేశ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశానికి గురైన ఆ యువతి బంగారు భవిష్యత్తును బలి తీసుకుంది. హుస్నాబాద్​లోని బాలాజీ నగర్​కు చెందిన హంసిని(23) ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

పట్టణానికి చెందిన వేల్పుల ఆనందం, సునీత దంపతులకు హంసిని పెద్ద కుమార్తె కాగా.. మరో కుమారుడు ఉన్నారు. ఆనంద్ ఆర్టీసీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. రెండు రోజుల నుంచి పీజీ ఎంట్రెన్స్​లో తక్కువ మార్కులు రావడంతో.. మంచి కాలేజీలో సీటు రాదని తన తల్లికి చెబుతూ బాధపడుతూ ఉండేదని యువతి తండ్రి తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్​కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

brother attack: క్షణికావేశం.. అన్న గొంతు కోసిన తమ్ముడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.