ETV Bharat / crime

కాలకృత్యాల కోసం వెళ్లి.. అనంతలోకాలకు చేరి..!

author img

By

Published : Apr 3, 2021, 3:58 PM IST

a boy fell into the pond
చెరువులో పడి బాలుడి మృతి

కాలకృత్యాలు తీర్చుకునేందుకని స్నేహితుడితో కలిసి చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడి చెప్పు ఒకటి చెరువులో పడిపోయింది. ఆ చెప్పును తీసేందుకు ప్రయత్నించి.. ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని శాంతినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి సోహెల్​ అనే బాలుడు మృతి చెందాడు. సోహెల్ తన స్నేహితుడు హాజీతో కలిసి స్థానికంగా ఉన్న సాకీ చెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చెప్పు చెరువులో పడిపోయింది. ఆ చెప్పును బయటకు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు సోహెల్​ చెరువులో పడి మునిగిపోయాడు.

గమనించిన హాజీ వెంటనే సోహెల్ తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: లిఫ్ట్ అడిగి.. పోలీసునని బెదిరించి బైక్ ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.