ETV Bharat / city

CM KCR: కేసీఆర్ చెప్పిన స్నేహితుడి మాట.. శోభమ్మ ముచ్చట విన్నారా?

author img

By

Published : Aug 16, 2021, 7:36 PM IST

Updated : Aug 16, 2021, 8:52 PM IST

cm kcr
cm kcr

తెలంగాణ ఉద్యమం నాడు.. ఓ మిత్రుడు.. 'కేసీఆర్​ నీకు తిన్నది అరగదా.. రా.. ఉన్నకాడ ఉండవ్​.. మళ్లో దుకాణం మొదలు పెట్టినవ్​ అన్నడని. అప్పుడు తాను ఏ విధంగా సమాధానమిచ్చానో.. హుజూరాబాద్​ నియోజకవర్గం శాలపల్లిలో నిర్వహించిన సభ సందర్భంగా కేసీఆర్​ చెప్పారు. ఉద్యమ సమయం, దళిత బంధు సమాలోచనలు చేస్తున్న సమయంలో తన సతీమణి ప్రోత్సాహాన్ని కేసీఆర్​ వివరించారు.

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గం శాలపల్లిలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా.. పలు ఆసక్తికర విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. తన మిత్రులు, తన భార్య అన్న.. నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

'తెలంగాణ ఉద్యమానికి పోయిననాడు.. ఓ మిత్రునితో మాట్లాడిన.. అప్పుడు అన్నాడు అతను.. నీకు ఇద్దరు పిల్లలు.. అమెరికాలో స్థిరపడినారు.. ఇప్పుడు తెలంగాణ పంచాయితీ ఏం​పెట్టుకుంటవ్​ నువ్వు అన్నడు. ఎన్ని తిడతరో.. ఎన్ని బదనాములు పెడతరో.. ఎన్ని బాధలు పెడతరో.. ప్రశాంతంగా ఉండాల్సిన జీవితంలో అగ్గి రాజేసుకుంటున్నావని' నాడు తన మిత్రుడు చెప్పిండని కేసీఆర్​ అన్నారు.

అప్పుడు నేనొకటే మాట అడిగిన.. 'తెలంగాణ వస్తే ఎట్లా ఉంటదని అడిగిన... బహ్మాండంగా ఉంటదని చెప్పిండు.. ఇక నీకు దండం పెడతా గంతకే ఉండు.. లేనిపోని భయాలు పెట్టకని' చెప్పిన.. అని నాటి మాటల్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

'మళ్లా అదే మిత్రుడు.. మొన్న దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యులతో తాను వర్క్​షాప్​ పెట్టిన వార్త పేపర్లో చూసి నవ్వుకుంటా.. ఒకటే మాట అన్నడు.'

'కేసీఆర్​ నీకు తిన్నది అరగదా.. రా.. ఉన్నకాడ ఉండవ్​.. మళ్లో దుకాణం మొదలు పెట్టినవ్​ అన్నడు. మొట్టమొదట పెట్టిన దుకాణం బాగుందా అంటే బాగుందన్నడు. అయితే ఈ దుకాణం అంతకంటే ఎన్నో రెట్లు బాగుంటది.. ఒక నాలుగేండ్లలో భారతదేశానికే కాదు.. మొత్తం ప్రపంచానికే మార్గం చూపిస్తది అని చెప్పిన.. నాలుగేండ్లు నేను బతకాలని కోరుకోమని చెప్పిన.. నువ్వు కూడ బతికుండ్ర అని చెప్పిన చాలా సంతోషమని మాట్లాడిండు.' అని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పారు.

కేసీఆర్ చెప్పిన స్నేహితుడి ముచ్చట్లివే...
  • కేసీఆర్​ నోట.. పలుమార్లు ..జై భీం నినాదం

దళిత బంధు ప్రారంభోత్సవం సందర్భంగా.. జై భీం అంటూ కేసీఆర్​ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా.. జై భీం అంటూ గట్టిగా నినదించిన కేసీఆర్​.. అక్కడున్నవారంతా జై భీం అనేలా ఉత్సాహపరిచారు. తన ప్రసంగం ఆఖరులోనూ.. జై భీం.. జై హింద్​.. జై తెలంగాణ అంటూ ముగించారు.

  • కేసీఆర్​ నోట.. గోరటి వెంకన్న పాట

రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలున్నాయని.. వారందరికీ దళిత బంధు అమలుచేసినా.. ఈ పథకానికి అయ్యే ఖర్చు... ఒక లక్ష డబ్బై వేల కోట్లు.. ఏడాదికి ముప్పై.. నలబై వేల కోట్లు ఖర్చుచేసుకుంటూ పోతే.. మూడు నాలుగేళ్లు దళిత వాడలు బంగారు మేడలైతయ్​ అన్నారు. ఈ సందర్భంగా.. గొరటి వెంకన్న '.. 'ఇవాళ్టి నుంచి పట్టుబడితే.. దళితవాడలన్నీ బంగారు మేడలైతయ్​.. వెన్నెల విరజిమ్ముతుందని' రాసిండంటూ గుర్తుచేస్తున్నారు.

  • కేసీఆర్​ నోట.. తనతో సతీమణి సంభాషణ

తాను, హరీశ్​రావు.. తెలంగాణ ఉద్యమానికి సిద్ధమవుతున్న సమయంలో.. తన సతీమణితో జరిగిన సంభాషణను.. ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

కేసీఆర్ చెప్పిన శోభమ్మ ముచ్చటిదే...

'తెలంగాణ ఉద్యమానికి పోయిననాడు.. హరీశ్​నాతో ఉండేవాడు. మేమో నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిదని నా భార్యను అడిగిన.. ఏమమ్మ మరి ఉద్యమానికి పోదామా.. ఏమంటవ్​ అని అడిగిన.. మనం ఇప్పుడు పిల్లలకు చేసేదేం లేదు. నువ్వు నేను తినేదేంత పావుసేరు బియ్యం.. కొట్లాడు మంచిదేనని చెప్పింది. మొన్న కూడా అడిగిన.. దళిత బంధు ఉద్యమాన్ని చేపడుతున్నం.. మరి నువేమంటవమ్మా.. అని అడిగితే.. వాళ్ల పరిస్థితి నిజంగా అన్యాయంగా ఉంది. నువ్వు మొండిపట్టు పడతవ్​ కదా ఏదైనా పడితే.. చెయ్​ తప్పకుండా నువ్​ గెలుస్తావ్​ పో.. అంటూ ఆశీర్వచనం ఇచ్చింది.

ముఖ్యమంత్రి కేసీఆర్​.

ఇదీచూడండి: CM KCR : హుజూరాబాద్​లోని ప్రతీ ఎస్సీ కుటుంబానికి రెండునెలల్లో 'దళితబంధు'

Last Updated :Aug 16, 2021, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.