ETV Bharat / city

TOP NEWS: టాప్​ న్యూస్ @9 PM

author img

By

Published : Jun 26, 2022, 8:58 PM IST

9pm topnews
9pm topnews

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • కొల్లాపూర్‌ కొట్లాట: ఎమ్మెల్యే బీరం అరెస్టు.. బ్యాంక్​ ఆధారాలతో జూపల్లి..

నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిల పరస్పర సవాళ్లు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.

  • రేపటి నుంచే రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు..

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రేపటి నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

  • 'ఆ బోర్డు తీసేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతాం'

హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన 'సాలు దొర.. సెలవు దొర' డిజిటల్ బోర్డును తీసేయాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు.

  • మైనర్​తో పెళ్లి చేయాలని యువకుడు సజీవదహనం..

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ప్రేమించిన బాలికను ఇచ్చి పెళ్లి చేయడం లేదని.. ఓ యువకుడు సజీవదహనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • అగ్నిపథ్​ ఉపసంహరణకే పలు రాష్ట్రాలు డిమాండ్​..

సాయుధ బలగాల్లో అగ్నిపథ్ పథకం కింద చేరే యువకుల భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారింది. సర్వీసు పూర్తయిన నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని కొన్ని భాజపా పాలిత రాష్ట్రాలు ప్రకటించగా, భాజపాయేతర పాలిత రాష్ట్రాలు ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్​ చేస్తున్నాయి.

  • ఆ నోటీసులపై.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏక్​నాథ్​ శిందే

శివసేన తిరుగుబాటు నేత ఏక్​నాథ్​ శిందే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర రెబల్​ ఎమ్మెల్యేలకు.. డిప్యూటీ స్పీకర్​ అనర్హత నోటీసులు అందించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పిటిషన్​ దాఖలు చేశారు. శివసేన శాసనసభా పక్ష నేతగా తనను తొలగిస్తూ.. అజయ్​ ఛౌదరిని నియమించడాన్ని కూడా సవాల్​ చేశారు శిందే.

  • 'నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచాన్ని నడిపేది మనమే'

నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్.. వెనుకబడిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జర్మనీలో భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. వలస ప్రాంతంగా ఉండటం వల్ల తొలి పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను దేశం పొందలేకపోయినట్లు చెప్పారు.

  • వారంలో 4 రోజులే పని.. జీతం తక్కువ.. గ్రాట్యుటీ ఎక్కువ..

నూతన కార్మిక చట్టాలను జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అయితే కొత్త చట్టాలపై ప్రైవేటు ఉద్యోగులకు అనేక సందేహాలున్నాయి. కొత్త చట్టాల్లో ఏముంది? రోజువారీ పనివేళలు, వీక్లీఆఫ్​ల పరిస్థితేంటి? జీతం ఏమైనా తగ్గుతుందా? రిటైర్మెంట్​ తర్వాత గ్రాట్యూటీ పెరుగుతుందా?

  • మూడేళ్ల తర్వాత చైనాను దాటి బయటకు జిన్​పింగ్​..

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ చాలా రోజుల తర్వాత విదేశీ పర్యటన చేయనున్నారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటి నుంచి ఆయన విదేశీ పర్యటనలు చేయలేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి హాంగ్‌కాంగ్‌లో పర్యటించనున్నారు.

  • 'రంగమార్తాండ' రిలీజ్​కు ప్లాన్​..

'పంచతంత్ర కథలు' సినిమాలోని 'నేనేమో మోతవరి' అంటూ సాగే పాటను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఇది శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. మరోవైపు దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'ను ఆగస్టులో రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.