ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 7 AM

author img

By

Published : Apr 13, 2022, 6:59 AM IST

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • యాసంగి వడ్లన్నీ మేమే కొంటాం..

ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందున రైతులు భరోసాతో ఉండాలి. ఎవరూ తక్కువ ధరకు వడ్లను అమ్ముకోవద్దు. కేంద్రం మొండిచేయి చూపించినంత మాత్రాన మేం చిన్నబుచ్చుకునేది లేదు. సమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి, రైతులకు అనుకూల నిర్ణయం తీసుకున్నాం.

  • కొండరెడ్ల అభివృద్ధి నా కల..

GOVERNOR: ఆదివాసీ, గిరిజన, కొండరెడ్లు అడవుల నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. అడవులే జీవన విధానంగా సాగుతున్న వారికి వైద్యం, విద్య, ఉపాధి మార్గాలు అందినప్పుడే నిజమైన ప్రగతి సాధిస్తారని స్పష్టం చేశారు. వారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లాలో రెండ్రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు.

  • ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత..

Group 1,2 Interviews: నేరుగా నియామకాలు చేపట్టే అన్ని ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలు రద్దు చేసింది. నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతానికి ఆస్కారం లేకుండా... ఎంపిక ప్రక్రియపై అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగేలా ఈ నిర్ణయం తీసుకొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టే అన్ని ఉద్యోగాలకు ముఖాముఖి రద్దు చేశారు.

  • నేడు యాదాద్రికి బండి సంజయ్..

BANDI SANJAY: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

  • నేటి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు..

pranahitha pushkaralu: నేటి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో ప్రాణహిత పుష్కరాలు జరిగితే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ పుష్కరాలను తెరాస ప్రభుత్వం నిర్వహిస్తోంది. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

  • ఆ బుల్డోజర్లు విద్వేశపూరితమైనవి..

Rahul Gandhi On BJP Bulldozers: దేశంలో రోజురోజుకూ అధికమవుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలపై బుల్డోజర్లు నడపాలని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. భాజపా బుల్డోజర్లు విద్వేశపూరితమైనవని ఆయన ఆరోపించారు. కాగా, రామనవమి రోజున ద్వేషపూరిత చర్యలకు పాల్పడ్డారంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు.

  • 'ఎక్స్​ఈ' వేరియంట్​ను తేలిగ్గా తీసుకోవద్దు..

Covid New Variant XE: మన దేశంలోనూ కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కొత్తగా బయటపడిన 'ఎక్స్‌ఈ' వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనుసుఖ్​​ మాండవియా ప్రజలను హెచ్చరించారు. కాగా, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.

  • అలా ఉంటే యుద్ధం వచ్చేదే కాదు..

Russia Ukraine News: దేశంలోని ఏ భూభాగాన్ని కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. తాము అలా భావించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్​స్కీ మాట్లాడారు.

  • మొత్తానికి చెన్నై బోణీ..

IPL 2022: ఐపీఎల్​ 2022లో తొలి విజయాన్ని నమోదు చేసింది చెన్నైసూపర్ కింగ్స్​. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 193/9 పరుగులకే పరిమితమైంది ఆర్సీబీ. దీంతో 23 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది.

  • మేటి దర్శకులూ డిజిటల్​ బాటలోనే..

Director shows interest in OTT Platforms: 'బుల్లితెర వినోదాలకు ప్రత్యామ్నాయమే తప్ప.. వాటిది సినిమాలకు సరితూగే స్థాయి కాదు'.. కొన్నేళ్ల కిందట ఓటీటీల మాటెత్తితే సినీతారల నుంచి ఇలాంటి మాటలే వినిపించేవి. 'ఓటీటీ బాటలో నడిచే ఆలోచనలున్నాయా?' అని ప్రశ్నించినా.. 'అబ్బబ్బే ఆ ఆలోచనే లేదు. మా లక్ష్యం వెండితెరే' అనేవారు. కానీ, కొవిడ్‌తో సీన్‌ తలకిందులైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.