ETV Bharat / bharat

'భాజపా బుల్డోజర్లు విద్వేషపూరితమైనవి'

author img

By

Published : Apr 13, 2022, 4:27 AM IST

Updated : Apr 13, 2022, 8:15 AM IST

Rahul Gandhi On BJP Bulldozers: దేశంలో రోజురోజుకూ అధికమవుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలపై బుల్డోజర్లు నడపాలని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. భాజపా బుల్డోజర్లు విద్వేశపూరితమైనవని ఆయన ఆరోపించారు. కాగా, రామనవమి రోజున ద్వేషపూరిత చర్యలకు పాల్పడ్డారంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు.

bjps-bulldozer-carrying-hatred-terror-rahul-gandhi
bjps-bulldozer-carrying-hatred-terror-rahul-gandhi

Rahul Gandhi On BJP Bulldozers: కేంద్రంలోని భాజపా సర్కారుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలపై బుల్డోజర్లు నడపాలన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శ్రీరామనవమి సందర్భంగా హింసకు పాల్పడిన నిందితుల ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా బుల్డోజర్లలో విద్వేషం, భయోత్పాతం ఉన్నాయంటూ మంగళవారం ట్వీట్ చేశారు.

Sri RamaNavami Stone Pelting: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో హింసాకాండ చెలరేగింది. కొందరు దుండగులు రాళ్ల దాడి చేయడం వల్ల ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి సుమారు 80మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆది, సోమవారాల్లో ఖర్గోన్ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. జరిగిన ఆస్తి నష్టాన్ని దుండగుల నుంచే వసూలు చేస్తామని మధ్యప్రదేశ్​ ప్రభుత్వం పేర్కొంది. మరో వైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం సైతం కేంద్రంపై విరుచుకుపడ్డారు. శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడని పిలుస్తారని, అది స్వచ్ఛతకు చిహ్నమన్నారు. రామనవమి రోజున అసహనం, హింస, ద్వేషపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఇదీ చదవండి: రెండు కాలేజీల విద్యార్థుల వీరంగం.. రాళ్లు రువ్వుకుంటూ..!

Last Updated : Apr 13, 2022, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.