ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @9AM

author img

By

Published : Aug 9, 2022, 8:59 AM IST

Telangana News Today
Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • 75వసంతాల అక్షరయాత్ర

Indian education in 75 years of independence: వంద శాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా సాగుతున్న దశాబ్దాల విద్యా యజ్ఞంలో.. అడుగడుగునా సవాళ్లే. సమర్థులైన బోధకులు, మౌలిక వసతులు, నిధుల కొరత వేధిస్తూనే ఉంది. అయినా మొక్కవోని దీక్షతో దేశం ముందడుగు వేస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. నూరేళ్ల స్వతంత్ర భారత విద్యా రంగం ఏ శిఖరాలకు చేరాలి? ఇందుకు వచ్చే పాతికేళ్ల ప్రస్థానం ఎలా సాగాలి? అమృత మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం..

  • కపిల్ సిబల్‌పై కోర్టు ధిక్కార చర్యలు!

SIBAL CONTROVERSY: సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్​పై కోర్టుధిక్కార చర్యలు చేపట్టేందుకు అనుమతించాలని అటార్నీ జనరల్​కు ఇద్దరు న్యాయవాదులు లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పులపై సిబల్ విమర్శలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు అభ్యర్థించారు.

  • నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హెచ్‌సీయూ సత్తా

Nature Index Ranks 2022 : ప్రతిష్ఠాత్మక నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో దేశంలో విశ్వవిద్యాలయాల కేటగిరీలో హైదరాబాద్​ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్​సీయూ) ప్రథమ స్థానం దక్కించుకుంది. 72 పరిశోధన పత్రాల సంఖ్య, 19.46 షేర్‌తో ఆ స్థానం దక్కించుకున్నట్లు వర్సిటీ ఉపకులపతి వివరించారు.

  • ఐదేళ్లలో రూ.280 కోట్లు.. ఎట్టకేలకు తేల్చిన సీబీఐ

bodhan scam news : గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోధన్‌ కుంభకోణంలో శివరాజ్​ ముఠా దోచుకున్న సొమ్ము లెక్కను సీఐడీ అధికారులు తేల్చారు. మొదట్లో దాదాపు రూ.500 కోట్ల వరకు కొల్లగొట్టారని భావించినా.. సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన అనంతరం ఆ మొత్తం రూ.280 కోట్లుగా తేలింది. అయితే శివరాజ్‌ ముఠా 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల పాటు దోపిడీకి పాల్పడితే.. ఈ కేసు దర్యాప్తునకూ సీఐడీకి ఐదేళ్లు పట్టడం గమనార్హం.

  • రూ.12వేల లోపు చైనా ఫోన్లపై నిషేధం?

CHINA MOBLIES BAN: చైనా మొబైల్ సంస్థలపై కేంద్రం కత్తిదూయనుందా?.. ఇకపై రూ.12వేల లోపు ఫోన్లు విక్రయాలపై పరిమితులు విధించనుందా? అంటే.. విశ్వనీయ వర్గాలు ఔననే అంటున్నాయి. భారత్​ రెండో అతిపెద్ద మొబైల్ విపణి కాగా.. ఈ మార్కెట్​ను కోల్పోవడం చైనా సంస్థలకు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.

  • ప్రగతి బాటలో పరిశ్రమలు

AZADI KA AMRIT: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 75 సంవత్సరాల కాలంలో పారిశ్రామిక రంగం విశేషంగా అభివృద్ధి చెందింది. స్వతంత్ర భారత తొలి ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాలకు తెరతీయగా.. క్రమానుగతంగా ఈ రంగం ప్రపంచ పారిశ్రామిక రంగంలో భారత్​ను 9వ స్థానానికి చేరింది. ఈ నేపథ్యంలో.. నాటి నుంచి నేటి వరకు పారిశ్రామిక రంగంలో జరిగిన అభివృద్ధి, ఇందుకోసం జరిగిన కృషి, 25 ఏళ్లలో ఎదురయ్యే సవాళ్లపై 'ప్రత్యేక కథనం'..

  • ఎయిర్‌టెల్‌ అదుర్స్.. లాభం ఐదింతలు

Airtel Q1 results: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐదింతల లాభాన్ని ఆర్జించింది ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌. కంపెనీ ఆదాయం సైతం 24 శాతం పెరిగింది. గతేడాది రూ.283.5 కోట్ల నికర లాభాన్ని గడించగా.. ఈ ఏడాది రూ.1607 కోట్లు సాధించింది.

  • హోమ్​ లోన్లకు గిరాకీ.. ఐదేళ్లలో రూ.48లక్షల కోట్లకు విపణి

Home loan SBI Research: గృహ రుణాలకు దేశంలోని మూడు, నాలుగో శ్రేణి పట్టణాల నుంచి అధిక గిరాకీ లభిస్తోంది. గత ఏడాది కాలంలో దేశంలోని ప్రధాన నగరాల కంటే చిన్న నగరాలు, నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని 'ఎస్​బీఐ రీసెర్చ్' నివేదికలో వెల్లడైంది. మహిళలు సైతం అధికంగా రుణాలు తీసుకుంటున్నారు.

  • అమ్మాయిలు.. సరిలేరు మీకెవ్వరూ

Commonwealth Games 2022 indian women athlets: దేశం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు చేసుకుంటోన్న వేళ ఆంగ్లేయుల గడ్డపైన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు మన క్రీడామణులు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో వీళ్లు సాధించిన ప్రతి పతకం వెనకా పట్టుదల, శ్రమతోపాటు ఓ స్ఫూర్తిగాథ దాగుంది. తమ కలల్ని నిజం చేసుకోవడంలో పేదరికం, గాయాలు, వయసు, సాంకేతిక అంశాలు... ప్రతి అడ్డంకినీ దాటిమరీ విజయబావుటా ఎగరేశారు. వారెవరో తెలుసుకుందాం...

  • మహేశ్​ 'పోకిరి' సరికొత్త రికార్డు

Maheshbabu Pokiri movie: సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన 'పోకిరి' అప్పట్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు మహేశ్​బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీమాస్టర్ చేసి 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.