ETV Bharat / state

Nature Index Ranks: నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హెచ్‌సీయూ సత్తా..

author img

By

Published : Aug 9, 2022, 8:35 AM IST

Nature Index Ranks 2022 : ప్రతిష్ఠాత్మక నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో దేశంలో విశ్వవిద్యాలయాల కేటగిరీలో హైదరాబాద్​ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్​సీయూ) ప్రథమ స్థానం దక్కించుకుంది. 72 పరిశోధన పత్రాల సంఖ్య, 19.46 షేర్‌తో ఆ స్థానం దక్కించుకున్నట్లు వర్సిటీ ఉపకులపతి వివరించారు.

నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హెచ్‌సీయూ సత్తా

Nature Index Ranks 2022 : ప్రతిష్ఠాత్మక నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(HCU) సత్తా చాటింది. దేశంలో విశ్వవిద్యాలయాల కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకుంది. మొత్తం మీద 16వ స్థానం సాధించింది. 72 పరిశోధన పత్రాల సంఖ్య, 19.46 షేర్‌తో ఆ స్థానం దక్కించుకున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొ.బీజే రావు తెలిపారు. ఈ ర్యాంకుల్లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తొలి స్థానంలో నిలిచింది. ఈ సంస్థ ఆచార్యులకు సంబంధించి 194 పరిశోధన పత్రాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

....

తెలుగు రాష్ట్రాల నుంచి పలు విద్యాసంస్థలూ చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌కు 23వ ర్యాంకు, ఐసెర్‌ తిరుపతికి 26వ ర్యాంకు, అమిటీ యూనివర్సిటీకి 54వ ర్యాంకు, నైపర్‌-హైదరాబాద్‌కు 76వ ర్యాంకు, ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌కు 82వ ర్యాంకు, ఆంధ్రా యూనివర్సిటీకి 92వ ర్యాంకు, జేఎన్‌టీయూ కాకినాడకు 108వ ర్యాంకు, ఐఐటీ తిరుపతికి 122వ ర్యాంకు దక్కాయి. 2021 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి.. ఈ ఏడాది మార్చి 31 మధ్య ప్రచురితమైన పరిశోధన పత్రాల ఆధారంగా నేచర్‌ జర్నల్‌ ఆయా ర్యాంకులను కేటాయించింది. ప్రధానంగా రసాయనశాస్త్రం, లైఫ్‌సైన్సెస్‌, భౌతిక శాస్త్రంలో పరిశోధనలను ఆధారంగా తీసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.