ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 9AM

author img

By

Published : Jun 19, 2022, 8:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
TOP NEWS

  • మీరు.. ఎలాంటి నాన్న?

Fathers Day 2022: ఒకప్పుడు నాన్నంటే హడల్‌... అది స్కూలు ప్రోగ్రెస్‌ రిపోర్టు చూపించడం కావచ్చు, ఎక్స్‌కర్షన్‌కి వెళ్లాలన్న కోరిక కావచ్చు, సినిమాకెళ్లి రాత్రి ఆలస్యంగా వచ్చిన సంగతే కావచ్చు... అమ్మ వెనకాల నిలబడే విషయం నాన్న ముందుకు తీసుకెళ్లేవారు..! మరి ఇప్పుడో... సగం మంది నాన్న కూచిలే..!

  • నాన్నకు ప్రేమతో

అమ్మాయిలకు నాన్నే మొదటి హీరో అంటారు. మరి రియల్‌లైఫ్‌లోని తమ మొదటి హీరో గురించి ఈ హీరోయిన్లు ఏం చెబుతున్నారంటే...

  • నేడు, రేపు భారీ వర్షాలు!

Telangana Rain Today: వాతావరణంలో అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.

  • డిస్కంలకు రూ. 8,925 కోట్లు

Discom losses in telangana: రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు భారీగా నష్టాలను చవిచూస్తున్నట్లు సర్కార్‌ తెలిపింది. 2016-20 మధ్య డిస్కంలకు 26 వేల 254 కోట్ల నష్టాలు రాగా... అందులో 8 వేల 925 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొంటూ నిధులు విడుదల చేసింది. ఆ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • కిడ్నీలపై 'సిలికా'టు

Kidney Failure Disease: మూత్రపిండాల వైఫల్య వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. పేదలు, ధనికులనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ కిడ్నీ దెబ్బకు కుదేలవుతున్నారు. బీపీ, షుగర్‌ తదితరాలు ఇప్పటివరకు దీనికి ప్రధాన కారకాలుగా గుర్తించగా, ఇప్పుడు ఆ జాబితాలో ప్రమాదకర ఖనిజం సిలికా చేరింది.

  • ఎంపీల పనితీరే మారిపోయింది

సెల్‌ఫోన్‌ రాకతో ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు పెరిగిపోయాయని, ఫలితంగా క్షేత్రస్థాయిలోనే ఎక్కువగా ప్రజాప్రతినిధులు ఉంటున్నట్లు చెప్పారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎంపీల పనితీరులో సమూల మార్పు వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు.. సాగు బిల్లులను స్థాయీ సంఘాలకు పంపాలన్న వాదన సబబేనన్నారు.

  • పుట్టినప్పుడు నడవలేడన్నారు

Adil Altaf: పుట్టగానే ఆ పసివాడు నడవలేడని చెప్పారు వైద్యులు. అయినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి జమ్ముకశ్మీర్​కే పేరు తెచ్చిపెట్టేంత స్థాయికి ఎదిగాడు ఆ కుర్రాడు. ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో బంగారు పతకాన్ని సాధించాడు. ఆ యువకుడు ఎవరు?.. అతని కథ ఏంటో తెలుసుకుందామా?

  • న్యాయవ్యవస్థను ఎదిరించిన భారతీయ జడ్జి

జస్టిస్‌ సయ్యద్‌ మహమూద్‌... భారత చరిత్రలో చాలా తక్కువగా వినిపించే పేరు. హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా తలచుకోకుండా ఉండని చరిత్ర ఆయనది. ఇంగ్లాండ్‌ ప్రివీ కౌన్సిల్‌తోనే శభాష్‌ అనిపించుకున్న జస్టిస్‌ మహమూద్‌... న్యాయస్థానంలో ఆంగ్లేయుల అరాచకాన్ని నిలదీశారు. తెల్లవారి న్యాయపద్ధతులను తప్పుపట్టారు. చీఫ్‌ జస్టిస్‌తో విభేదించి.. చివరకు తన పదవినీ తృణప్రాయంగా వదులుకున్నారు.

  • సాయిపల్లవే ఆ లోటు తీర్చింది

నిజ జీవితంలో నాన్న పాత్రకి దూరంగా ఉన్న నటుడు సాయిచంద్.. తెలుగు చిత్రసీమలో తండ్రి పాత్రలకి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. నేడు పితృదినోత్సవం సందర్భంగా ఆయన తన గురించి పలు విషయాలను తెలిపారు. ఇందులో భాగంగానే నటి సాయిపల్లవితో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఆ సంగతులివీ...

ప్రముఖ మహిళా క్రికెటర్​ టెస్టు క్రికెట్​కు గుడ్​బై

England katherine retirement: ఇంగ్లాండ్​ మహిళా పేసర్​ కేథరిన్​ బ్రుంట్​ టెస్టు క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించింది. వైట్​బాల్​ ఫార్మాట్​లో మరింత బాగా రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.